Shocking Video: మైదానంలో కుప్పకూలి మృతిచెందిన యువ వాలీబాల్ ప్లేయర్

దేశమంతా దుర్గా మాత పూజలు జరుగుతున్నవేళ.. అస్సాంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువ వాలీబాల్ ప్లేయర్ మైదానంలో కుప్పకూలి పడిపోయి.. మృతిచెందాడు.

news18-telugu
Updated: October 23, 2020, 1:44 PM IST
Shocking Video: మైదానంలో కుప్పకూలి మృతిచెందిన యువ వాలీబాల్ ప్లేయర్
మైదానంలో కుప్పకూలి మృతిచెందిన వాలీబాల్ ప్లేయర్(Photo-FaceBook/Dr. Numal Momin)
  • Share this:
దేశమంతా దుర్గా మాత పూజలు జరుగుతున్నవేళ.. అస్సాంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువ వాలీబాల్ ప్లేయర్ మైదానంలో కుప్పకూలి పడిపోయి.. మృతిచెందాడు. వివరాలు.. కర్బీ అంగ్లాగ్ జిల్లా బోకాజన్‌లోని జపరాజాప్ మైదానంలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో జాకరియా అనే వాలీబాల్ ప్లేయర్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అయితే పైకి లేచేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రెండు మూడు సార్లు ఇలానే జరిగింది. దీంతో పక్కనే కొందరు వెంటనే అతని వద్దకు చేరుకున్నారు. అయితే గుండెపోటుతో అతని అక్కడే మరణించాడు. ఇక, గతంలో అతనికి గుండె సంబంధిత అనారోగ్యం ఉన్నట్టు అక్కడున్నవారు చెప్పారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ వీడియోను బోకాజన్ బీజేపీ ఎమ్మెల్యే నుమాల్ మోమిన్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మొత్తంగా 14 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసిన వారు చాలా షాక్ గురవుతున్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 23, 2020, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading