Home /News /national /

SHOCKING VIDEO IN INDIA CAPITAL DELHI THREE WOMENS ATTACKED BY UNKNOWING PERSONS NGS

Delhi shocker: దేశ రాజధానిలో దారుణం.. కారు దిగి వెళ్తున్న మహిళను ఏం చేశారో చూస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం

Viral Video: దేశంలో ఎక్కడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అయితే మరీ దారుణం. మహిళలు ఒంటరిగా భయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటన.. చీకటి పడితే బయటకు వెళ్లడం సేఫ్ కాదేమో అనిపిస్తోంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    Delhi Attack viral video: భారత దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ అన్నది సమాధానం లేని ప్రశ్నగానే ఉంటోంది. అర్థారాత్రి మహిళ  ఒంటరిగా (single women) బయటకు వెళ్లడం సంగతి అటు ఉంచితే.. ఏ సమయంలోనూ మహిళ గడప దాటి బయటకు అడుగు పెట్టాలి అంటేనే చాలా భయపడే పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే మహిళ రక్షణ కోసం ఎన్నో కొత్త కొత్త చట్టాలు పెడుతున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అడుగడుగునా నిఘా పెడుతున్నారు. పోలీసులు (police) గస్తీ కాస్తూనే ఉన్నారు. ఇన్ని చేస్తున్నా.. ఆడది ఒంటరిగా రోడ్డుపైకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. దేశంలో ఏదో ఒక చోట ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో అలాంటి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అది కూడా ఢిల్లీ నడిబొడ్డున ప్రాంతంలో జరిగిందే.. కారులోంచి దిగి నడుచుకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా కొందరు దుండుగులు దాడికి పాల్పడ్డారు. అది కూడా మహిళలు అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి (Attack on women)చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది..

    ఢిల్లీలోని.. షాలిమార్‌ బాగ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగ్గా రాత్రి 10గంటల 15 నిమిషాలకు.. అక్కడ పార్కింగ్ చేసిన కారులన్నీ ఉంటే.. ఖాళీ ప్రదేశంలో కారు ఆపి.. అందులోంచి ఇద్దరు మహిళలు కిందకు దిగగా.. మరో మహిళ కారును పార్కింగ్ చేస్తోంది. ఆ ఇద్దరు కారు దిగి నడుచుకుని వెళ్తుంటే వెనుక నుంచి కొంతమంది దుండగులు వారి దగ్గరికి వచ్చి ఘర్షణకు దిగారు. తరువాత వారిపై స్టిక్స్ తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

    అది గమనించి కారు పార్కింగ్ చేసిన మహిళ కిందకు దిగి ఏంటీ ఈ పని అని నిలదీస్తే.. మహిళ అని కూడా ఆలోచించకుండా దారుణంగా ఆమెను కొట్టేరు. వారి దెబ్బలకు కిందకు పడిపోయిన తరువాత కూడా విడిచి పెట్టలేదు. తరువాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గత నెల 19 న జరిగింది. ఈ దాడిలో గాయపడిన ఓ మహిళ.. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఇదీ చదవండి : ఏపీని వెంటాడుతున్న ముప్పు.. దూసుకొస్తున్న జవాద్‌.. 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు

    బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆవెంటనే గొడవ జరిగిన ప్రదేశానికి వెళ్లి.. ఆరోజు రాత్రి వీధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ మహిళ చెప్పింది నిజమే అని నిర్ధారించుకుని.. నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఘర్షణకు కారణం ఏంటి..? దాడి చేసిన వారు మహిళలకు తెలిసిన వారేనా.. తెలిస్తే అసలు సంబంధం ఏంటి..? వారికి పరిచయం లేని వ్యక్తులు అయితే ఏ విషయంలో గొడవ జరిగింది.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మహిళలపై దాడి స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Delhi, Police Case, Viral Video, WOMAN

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు