Sex for Oxygen: మీ నాన్నకు ఆక్సిజన్ సిలిండర్ కావాలా.. అయితే నాతో పడుకో..

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా పేరు చెబితేనే జనాలు భయపడిపోతున్నారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా పేరు చెబితేనే జనాలు భయపడిపోతున్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా.. నిలవాల్సిందిపోయి వారిని వేధించుకు తింటున్నారు కొందరు కామాంధులు. వారి నిస్సహాయతకు, అవసరాన్ని గమనించి.. వారిని తమకేంటి ప్రశ్నిస్తున్నారు. కొందరైతే సెక్సువల్ ఫేవర్స్ కావాలని కోరుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించి ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా తన గళాన్ని వినిపించింది. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా సమాజంలో కొందరి కళ్లు కామంతో మూసుకునే ఉన్నాయని అనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది.

    సదురు నెటిజన్.. తన ఫ్రెండ్ సోదరికి ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. ‘నా స్నేహితుడి సోదరి.. నాకు చిన్న చెల్లెలు లాంటింది. ఆమె తండ్రికి ఇటీవల కరోనా బారిన పడటంతో.. ఆక్సిజన్ సిలిండర్ అవసరం పడింది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ కోసం అనేక ప్రయత్నాలు చేసింది. వారు ఓ ఉన్నతమైన కాలనీలో ఉంటారు. ఇక, ఆక్సిజన్ సాయం కోసం పొరుగింటిలో ఉండే వ్యక్తిని అడిగింది. అయితే అతడు ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే..అతనితో పడుకోవాలని కోరాడు’అని ట్వీట్ చేసింది. #HumanityIsDead అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది.





    ఒకే ఊపిరితిత్తితోనే కరోనాపై పోరులో విజయం.. ఓ నర్సు విజయగాథ..

    ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాశంగా మారింది. నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు అలాంటి వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని అతని కుటుంబంలోని ఆడవాళ్లకు చెప్పాలని.. ఓ నెటిజన్ కామెంట్ చేశారు. జనాలు ఇలా ఎలా ఉంటారో అర్థం కావడం లేదంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: