హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Working Women: షాకింగ్ సర్వే .. ఆ పని చేసే మహిళలకు పెళ్లి కావడం లేదంటా..! కారణాలు చదివితే ఆశ్చర్యపోతారు..!!

Working Women: షాకింగ్ సర్వే .. ఆ పని చేసే మహిళలకు పెళ్లి కావడం లేదంటా..! కారణాలు చదివితే ఆశ్చర్యపోతారు..!!

షాకింగ్ సర్వే .. ఆ పని చేసే మహిళలకు పెళ్ళి కావడం లేదంటా..! కారణాలు చదివితే ఆశ్చర్యపోతారు..

షాకింగ్ సర్వే .. ఆ పని చేసే మహిళలకు పెళ్ళి కావడం లేదంటా..! కారణాలు చదివితే ఆశ్చర్యపోతారు..

పని చేసే మహిళలకు (Working Women) మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌(Matrimonial Websites)లలో పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం కనుగొంది. పని చేయని మహిళలకు ఎక్కువ స్పందన కనిపిస్తోందని పేర్కొంది.

పని చేసే మహిళలకు (వర్కింగ్ ఉమెన్‌) మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌(Matrimonial Websites)లలో పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం కనుగొంది. పని చేయని మహిళలకు ఎక్కువ స్పందన కనిపిస్తోందని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కి చెందిన బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో డాక్టరల్ అభ్యర్థి అయిన దివా ధర్, మ్యారేజ్(Marriage) మార్కెట్‌లో వర్కింగ్ ఉమెన్‌కు ఉన్న రెస్పాన్స్‌ పరీక్షించడానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. మ్యాట్రిమోని ప్లాట్‌ఫారమ్స్‌లో పెళ్లి తర్వాత వర్క్‌ కొనసాగిస్తామని చెప్పే మహిళల కంటే.. ఎప్పుడూ పని చేయని వారిపై ఆసక్తి 15-22 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఎప్పుడూ పని చేయని మహిళకు రియాక్ట్ అయ్యే ప్రతి 100 మంది పురుషులలో, 78-85 మంది మాత్రమే పని చేసే మహిళపై ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తేలింది.

దివా ధర్ మాట్లాడుతూ..‘భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పరిశోధించే వ్యక్తిగా, జెండర్‌ రోల్స్‌, పెళ్లి విషయంలో వర్కింగ్‌ ఉమెన్‌(Women)పై కనిపించే ప్రభావం గురించి అధ్యయనం చేపట్టాను. నేను ఆ వయస్సులోనే ఉన్నాను. నా స్నేహితులు చాలా మంది పెళ్లి తర్వాత పనిని వదులుకున్నారు. లేదా కెరీర్‌ను తగ్గించుకున్నారు. మహిళలు పని చేసినందుకు జరిమానా చెల్లించాలి, అనే భావన ఒక ప్రయోగం ద్వారా బయటపడుతుందో లేదో చూడాలనుకుంటున్నాను’ అని చెప్పారు.

ఫ్యాబ్రికేటెడ్‌ ప్రొఫైల్స్ పరిశీలన

దివా ధర్ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌(Website)లో 20 ఫ్యాబ్రికేటెడ్ ప్రొఫైల్‌లను తయారు చేశారు. వయస్సు, జీవనశైలి ప్రాధాన్యతలు, డైట్ విషయంలో అన్ని ప్రొఫైల్‌లు ఒకేలా ఉన్నాయి. అయితే వర్క్‌ చేస్తున్నారా?, భవిష్యత్తులో వర్క్‌ చేయాలనుకుంటున్నారా?, ఎంత సంపాదిస్తున్నారు? అనే అంశాలు మాత్రం వేర్వేరుగా పేర్కొన్నారు. అదే విధంగా ఆయా వర్గాలకు సరిపడేలా కూడా ప్రొఫైల్స్‌ రూపొందించారు. తర్వాత కొన్ని నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న శాంపిల్‌ సూటర్‌లను సెలక్ట్‌ చేసినట్లు, ఈ ప్రొఫైల్స్ నుంచి ఇన్విటేషన్స్‌ వెళ్లినట్లు దివా ధర్‌ చెప్పారు.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

వర్క్‌ చేయని మహిళలకు డిమాండ్‌

ప్రత్యేకమైన అంశం ఏంటంటే, పని చేయని స్త్రీలు పురుషుల నుంచి ఎక్కువ రెస్పాన్స్‌ పొందుతారు. పని చేస్తున్నప్పటికీ దానిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నవారిపై కూడా పురుషులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ధర్ చెప్పారు. పెళ్లి తర్వాత పని చేయాలనుకునే మహిళలకు పూర్తి వ్యత్యాసం ఉందని, రెస్పాన్స్‌ రేట్‌ చాలా తక్కువగా ఉంటోందని, వివాహ మార్కెట్‌ను చాలా మంది మహిళలు అనుమానించినది వాస్తవమేనని ధర్‌ వివరించారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, వివాహమైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలనుకునే స్త్రీలలో, అధిక సంపాదన కలిగిన స్త్రీలు సూటర్లలో ఎక్కువ రెస్పాన్స్‌ పొందారు. నాన్-వర్కింగ్ కేటగిరీతో పోలిస్తే, పురుషులు తమ కంటే ఎక్కువ సంపాదించే మహిళలకు రెస్పాండ్‌ అయ్యే అవకాశం 10 శాతం తక్కువగా ఉంది. పురుషుల కంటే తక్కువ సంపాదించే వారికి 15 శాతం పాయింట్లు రెస్పాన్స్‌ తక్కువగా కనిపిస్తోంది. 99 శాతం మంది భారతీయ మహిళలు 40 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటారని ధర్‌ చెప్పారు. పెళ్లి తర్వాత కూడా వర్క్‌ చేయాలని భావిస్తే మూల్యం చెల్లించక తప్పదని తెలిసి.. స్త్రీలు పెళ్లికి ముందు కెరీర్‌ను బిల్డ్‌ చేసుకోరని, లేదా వివాహం అయిన తర్వాత పనిని వదులుకుంటారని తెలిపారు.

Published by:Mahesh
First published:

Tags: Marriages, Survey, Women, Women harrasment

ఉత్తమ కథలు