హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Helicopter Crash: ఆరేళ్ల క్రితం మృత్యువును జయించారు.. మళ్లీ అదే హెలికాఫ్టర్ యమపాశమైంది

Helicopter Crash: ఆరేళ్ల క్రితం మృత్యువును జయించారు.. మళ్లీ అదే హెలికాఫ్టర్ యమపాశమైంది

ఆరేళ్ల క్రితం మరణాన్ని జయించారు.

ఆరేళ్ల క్రితం మరణాన్ని జయించారు.

Helicopter Crash: భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణ వార్తను దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే జరిదింది. కానీ ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకుని మృత్యుంజయుడు అనిపించుకున్నారు. అనూహ్యంగా మరోసారి అదే హెలీకాఫ్టర్ ప్రమాదం యమపాశమై వెంటాడింది.

ఇంకా చదవండి ...

Helicopter Crash:  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ మరణం యావత్ భారత దేశం జీర్ణించుకోలేకపోతోంది. గతంలో  ఎన్నో సందర్భాల్లో మరణానికి ఎదురెళ్లి మృత్యుంజయుడిగా తిరిగొచ్చారు.. మరణాన్ని ఎదిరించే వీరుడు అని గుర్తింపు పొందారు.. కానీ గతంలో ఆరేళ్ల క్రితం ఇలాగే జరిగిన పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డ ఆయన ఈ సారి మరణాన్ని తప్పించుకోలేకపోయారు.  తాజాగా తమిళనాడులోని జరిగిన  ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ (Army Chief General Bipin Rawat), ఆయన భార్య సహా 13 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ హెలికాఫ్ట‌ర్‌లో 14 మంది ప్ర‌యాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో బయటపడిన ఏకైక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.

నీలగిరి జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న 14 మందిలో 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వ్య‌క్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (Varun Singh) వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వింగ్ క‌మాండ‌ర్ వరుణ్ సింగ్  (27987) లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) స్క్వాడ్రన్‌లో పైలట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వ‌రుణ్ సింగ్‌కి 2021 ఆగస్టు 15న అతనికి శౌర్య చక్ర అవార్డు లభించింది. ప్ర‌స్తుతం వ‌రుణ్ సింగ్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఎటువంటి స‌మాచారం అంద‌లేదు. ఆయ‌నను వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స అంద‌జేస్తున్నారు.

ఇదీ చదవండి: ఉదయం భార్య పిల్లలతో వీడియో కాల్.. ఇంతలో ఊహించని విషాదం.. చివరి మాటలు ఇవే

ఇలా హెలీకాఫ్టర్ ప్రమాదం జరగడం ఆయకు ఇదే మొదటిది కాదు. 2015లో ఇలాంటి హెలికాప్టర్‌ ప్రమాదమే బిపిన్‌ రావత్‌కు ఎదురయ్యింది. అంటే ఆరేళ్ల క్రితం.. అప్పటికి బిపిన్‌ రావత్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్నారు. ఆ సమయంలో నాగాలాండ్‌లో హెలికాప్టర్‌ అనూహ్యంగా కుప్పకూలింది. అప్పుడు ఆయన మరణించారని అంతా అనుకున్నారు.. కానీ ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు మృత్యువును జయించిన బిపిన్‌ రావత్‌.. మరోసారి హెలికాప్టర్‌ ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు ముందు తలవంచాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ కవిత Vs మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఆదిప‌త్య పోరులో ఆమె నెగ్గారా..?

లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో బిపిన్‌ రావత్‌ (2015 ఫిబ్రవరి 3న) నాగాలాండ్‌ దిమాపుర్‌ జిల్లాలోని హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరారు. చీతా హెలికాప్టర్‌లో ఆయనతో పాటు మరో ఇద్దరు సిబ్బంది మాత్రమే అప్పుడు ఉండేవారు. సరిగ్గా హెలికాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొన్ని సెకండ్లకే.. సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో బయలుదేరిన కొద్ది సేపటికే అది కొంత ఎత్తుకు వెళ్లగానే కుప్పకూలింది. ఆ ప్రమాదంలో హెలికాప్టర్‌ పూర్తిగా తునాతునకలైంది. అయినప్పటికీ బిపిన్‌ రావత్‌తోపాటు సిబ్బంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే తరహాలో తాజాగా జరిగిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంలో మాత్రం బిపిన్‌ రావత్‌, ఆయన భార్య ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Army, Army Chief General Bipin Rawa, Army Of The Dead

ఉత్తమ కథలు