LIC : ఓర్నీ .. ఏకంగా వేరే దేశానికి చెందిన వ్యక్తికే ఎల్ఐసీ పాలసీ కట్టబెట్టారుగా..

ప్రతీకాత్మక చిత్రం

LIC : లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... పరిచయం అక్కర్లేని ప్రభుత్వ రంగ బీమా సంస్థ. దేశంలోని అన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలను కలిపినా... ఇన్స్యూరెన్స్ రంగంలో ఎల్ఐసీదే పైచేయి అన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... పరిచయం అక్కర్లేని ప్రభుత్వ రంగ బీమా సంస్థ. దేశంలోని అన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలను కలిపినా... ఇన్స్యూరెన్స్ రంగంలో ఎల్ఐసీదే పైచేయి అన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎల్ఐసీ గురించి తెలియనివాళ్లుండరు. దశాబ్దాలుగా కోట్లాదిమంది భారతీయులకు బీమా సేవల్ని అందిస్తున్న ఇన్స్యూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీ. అయితే, బీహార్ లోని ఓ LIC ఆఫీస్ ఏకంగా అఫ్గానిస్థాన్ కు చెందిన వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీని అమ్మింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. నకిలీ పత్రాలతో ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఆ వ్యక్తికి అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఎల్ ఐ సీ పాలసీ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, రెసిడెన్సీ సర్ఠిఫెకెట్లతో పాటు.. ఒక ఫోటో కావాలి. కానీ, వీటిని పట్టించుకోకుండా ఫోర్జరీ సర్టిఫికెట్లతో బీమా సేవల్ని అందించింది ఆ ఎల్ ఐ సీ ఆఫీస్. వివరాల్లోకెళితే.. బీహార్ లోని కతిహార్ లో ఐదుగురు అఫ్గానిస్తాన్ కు చెందిన వ్యక్తులు అక్రమంగా నివసిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే వార్త తెలిసింది. ఆ ఐదుగురిలో ఒకరికి LIC పాలసీ ఉంది.

    ఇది మాములు విషయం కాదు. LIC పాలసీని వేరే దేశానికి చెందిన వ్యక్తికి ఇవ్వడంపై స్థానిక పోలీస్ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. " ఈ విషయం సీరియస్ విషయం. అసలు అఫ్గాన్ వ్యక్తికి ఎలా ఎల్ ఐసీ ఇచ్చారన్నది ఆలోచించాల్సిన విషయం. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారికి ఇలా బీమా ఇవ్వడం నేరం. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టాం" అని ఆ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

    అఫ్గాన్ కు చెందిన వ్యక్తికి 2007 లో ఎల్ఐసీ పాలసీ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారం వెలుగులోకి రాకపోతే.. వచ్చే ఏడాది అంటే 2022లో అతను పూర్తి బీమా డబ్బులు పొందేవాడు. కతిహార్ కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ అక్రమంగా అఫ్గాన్ కు చెందిన వ్యక్తికి బీమా సౌకర్యం కల్పించినట్లు తెలుస్తోంది. సరియైన డాక్యుమెంట్లు లేకుండానే ఈ ఎల్ఐసీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎల్ఐసీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కతిహార్ ఎల్ఐసీ డెవలంప్మెంట్ ఆఫీసర్ కు సమన్లు జారీ చేశారు.దీనిపై వివరణ ఇవ్వాలని వారు కోరారు. ఈ ఒక్క విషయంలోనే కాదు.. చాలా సార్లు కతిహార్ ఎల్ఐసీ బ్రాంచ్ తప్పులు చేసినట్లు తెలుస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పేరు మీద లైసెన్స్ కూడా జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. గతేడాది డిసెంబర్ 15న ఐదుగురి అఫ్గాన్ వ్యక్తుల్ని స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయ్.
    Published by:Sridhar Reddy
    First published: