అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కేబినెట్ మంత్రి కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీలో చకచక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వెంట ఏడుగురు ఎమ్మెల్యేలు నడిచారు. పార్టీకి రాజీనామా చేసి ఆయన గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే తో పాటు ఓ మంత్రి సైతం రాజీనామా బాట పట్టారు. ముందుగా ముఖేశ్ వర్మ అనే ఎమ్మెల్యే రాజీనామా ప్రకటించడంతో పాటు స్వామి ప్రసాద్ మౌర్మ అణగారిన వర్గాలకు నాయకుడు అంటూ పేర్కొన్నాడు.
ఆ తర్వాత వెను వెంటనే మరో మంత్రి సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు... వెనుకబడిన వర్గాలకు చెందిన స్వతంత్ర మంత్రి ధరమ్‌సింగ్ సైనీ పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ముందుగా ఎమ్మెల్యే ఆ తర్వాత ఏకంగా మంత్రి పార్టీని వీడడం సంచలనంగా మారింది.కాగా ఈ పరిణామాలన్నింటికి కారణం ముందుగా రాజీనామా చేసిన కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అంటూ యూపీలో చర్చకొనసాగుతుంది. పార్టీని వీడిన నాయకులు.. ప్రధానంగా బీజేపీ అధికార నాయకత్వం.. వెనుక బడిన వర్గాలపై వివక్ష చూపిస్తుందని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా, అగౌరవ పర్చిందని ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది.
Constable remand : మహిళా కానిస్టేబుల్‌తో క్లోజ్.. రెండు సార్లు గర్భం చేసి.. ఆ తర్వాత..!
తాజాగా ముఖేష్ వర్మ తన లేఖలో ఒక అడుగు ముందుకేసి ‘స్వామి ప్రసాద్ మౌర్య వెనుకబడిన వర్గాల గొంతు’అని, ‘మా నాయకుడని’ లేఖలో అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, స్వామి ప్రసాద్ మౌర్యతోపాటు.. మరికొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరనున్నారో మరికొన్నిరోజుల్లో తెలువనుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి వరుస వలసలతో పెద్ద రాజకీయా దుమారం కొనసాగుతుంది.
ఈ క్రమంలోలోనే ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మోదీ అధ్యక్షతన రాజకీయా వ్వవహారాల కమిటీ భేటి అయింది. వర్చువల్ గా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పలువురు రాష్ట్ర ఇంచార్జులతో పాటు కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assembly Election 2022, Bjp, UP Assembly Elections 2022