Home /News /national /

SHOCK FOR WORK FROM HOME EMPLOYEES NOW THEY ALL GO TO OFFICES NEW PROPOSAL OF SOME COMPANIES HERE ARE THE DETAILS UMG GH

Hybrid Model: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు షాక్.. ఇకపై వారంతా ఆఫీసులకే.. ? కంపెనీల కొత్త ప్రతిపాదన .. !

ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేనా ?

ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేనా ?

ప్రస్తుతం ఇండియాలోని చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌(Hybrid Model)కు మారాలని భావిస్తున్నాయి. వారం అంతా రిమోట్‌ లొకేషన్‌(Remote Location)లో ఉండి పనిచేయడం ఇకపై ఉద్యోగులకు వీలు కాకపోవచ్చని ఓ సర్వే సూచించింది.

కరోనా(Corona) వేవ్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటి నుంచి వివిధ రంగాల్లో కీలక మార్పులు జరిగాయి. పని చేసే విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలోని చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌(Hybrid Model)కు మారాలని భావిస్తున్నాయి. వారం అంతా రిమోట్‌ లొకేషన్‌(Remote Location)లో ఉండి పనిచేయడం ఇకపై ఉద్యోగులకు వీలు కాకపోవచ్చని ఓ సర్వే సూచించింది. కొన్ని రోజులు ఆఫీసుల నుంచి పని చేయాల్సి వస్తుందని పేర్కొంది. రియల్ ఎస్టేట్ సంస్థ CBRE సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన సర్వే(Survey) ప్రకారం.. భారతదేశంలోని 73 శాతం ఆఫీసులు కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాలు నెమ్మదిగా వెనక్కి తగ్గుతుండటంతో, తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వకుండా.. హైబ్రిడ్ వర్కింగ్ ఏర్పాట్లను చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
మహమ్మారి తర్వాత కంపెనీలు ప్రధానంగా సౌకర్యవంతమైన పని విధానాలను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హైబ్రిడ్ వర్క్ మోడల్‌ ప్రాచుర్యంలోకి వచ్చింది.  సర్వే ప్రకారం.. 78 శాతం ఆఫీసులు ఉద్యోగులను తిరిగి రప్పించడంలో.. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నాయి.

అందుబాటులో నాలుగు విధానాలు
అనువైన పని విధానం అనేది నాలుగు నమూనాల మిశ్రమం. ఇందులో నిర్దిష్ట పరిస్థితుల కోసం రిమోట్ వర్క్‌ చేయడం, వారానికి త్రీ ప్లస్ ఆఫీస్ డేస్‌, సమానంగా ఆఫీసు, రిమోట్ వర్క్ డేస్‌, త్రీ-ప్లస్ రోజుల పాటు రిమోట్ వర్క్ ఉన్నాయి. 2022 ఇండియా ఆఫీస్ ఆక్యుపియర్ సర్వే పేరుతో CBRE ఫలితాలను విడుదల చేసింది. దాని ప్రకారం.. దాదాపు 38 శాతం మంది తాము ఆఫీసు బేస్డ్‌, రిమోట్ వర్క్‌ సమానంగా ఉండటాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. మిగిలిన 35 శాతం మంది వారంలో మూడు ఆఫీసు రోజుల కంటే ఎక్కువ ఉండాలని చెప్పారు. టెక్నాలజీ, BFSI కార్పొరేట్‌లు ప్రధానంగా ఆఫీస్ బేస్డ్‌, రిమోట్ వర్క్‌ సమానంగా ఉండే విధానాన్ని, లేదా ఆఫీసులో ఎక్కువ రోజులు పని చేయడాన్ని సమర్థిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

ఆఫీస్‌ స్పేస్‌లకు పెరుగుతున్న డిమాండ్‌
భారతదేశంలో సర్వేలో పాల్గొన్న 62 శాతం మంది వచ్చే మూడేళ్లలో తమ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోల పరిమాణాన్ని పెంచుకోవాలని భావిస్తుండటంతో ఆఫీస్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని నివేదిక పేర్కొంది. మరో మూడింట ఒక వంతు మంది తమ సౌకర్యవంతమైన పోర్ట్‌ఫోలియో వ్యూహంలో భాగంగా కో-వర్కింగ్ స్పేస్‌ల ద్వారా సౌకర్యవంతమైన డిమాండ్‌ను తీర్చడంతో పాటు తక్కువ స్థానాల్లో కన్సాలిడేషన్‌ చేస్తున్నట్లు సూచించింది.

ఇదీ చదవండి: Anveshi Jain: రవితేజ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న పోర్న్ స్టార్ అన్వేషి జైన్.. సన్ని లియోన్ తర్వాత ఆ స్థాయిలో..


ESG సూత్రాలు ఊపందుకోవడంతో కార్యాలయానికి తిరిగి రావడానికి వేగవంతమైన వ్యూహంలో భాగంగా యజమానులు స్థిరత్వం, ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. సర్వేలో భాగమైన 52 శాతం మంది ESG-కంప్లైంట్ భవనాలను పొందడానికి, తరలించడానికి సిద్ధంగా ఉన్నారని, మరో 7 శాతం మంది ప్రీమియం అద్దెతో కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నారని సర్వే తెలిపింది. సర్వే ప్రకారం.. 44 శాతం కంపెనీలు 2022 నాటికి సీటింగ్ ఏర్పాట్లను చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది 81 శాతం సంస్థల కంటే చాలా తక్కువగా ఉంది.


సర్వే ఫలితాలపై ఇండియా, సౌత్-ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఛైర్మన్‌, సీఈవో అన్షుమాన్ మ్యాగజైన్, CBRE మాట్లాడుతూ.. భారతదేశంలోని అనేక కార్పొరేట్‌లు ఇప్పటికే రిటర్న్ టు ఆఫీసు పాలసీ పాటిస్తున్నాయి. ప్రస్తుతం నగరాల్లో కూడా వివిధ ఆఫీసులు ప్రారంభం అవుతున్నాయి. మహమ్మారి నుంచి హైబ్రిడ్ మోడల్‌ విస్తృతంగా స్వీకరించడంతో, అనేక కంపెనీలు ఇప్పటికీ ఉద్యోగుల ప్రొడక్టివిటీ, కనెక్టివిటీని పెంచడానికి అవసరమైన చర్యలను పరిశీలిస్తున్నాయి. అంతేకాకుండా, స్వల్పకాలిక లీజింగ్ సెంటిమెంట్ ఇప్పటికే పుంజుకోవడంతో - తదుపరి త్రైమాసికాల్లో కూడా ట్రెండ్‌ కొనసాగుతుంది. దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియో వృద్ధి అంచనాలు సానుకూలంగానే ఉన్నాయి’ అని చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: It companies, IT jobs, JOBS, Work From Home

తదుపరి వార్తలు