హోమ్ /వార్తలు /జాతీయం /

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ చెంపపై కొట్టిన యువకుడు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ చెంపపై కొట్టిన యువకుడు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేస్తున్న యువకుడు (ANI)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేస్తున్న యువకుడు (ANI)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్నికల ప్రచారం సందర్భంగా దాడి జరిగింది. ఓ వ్యక్తి హఠాత్తుగా ఆయనపైకి వెళ్లి చెంపపై కొట్టాడు.

    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊహించని షాక్ తగలింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మోతీనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి హఠాత్తుగా దాడి చేశారు. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన ఓ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న ఆప్ కార్యకర్తలు అవాక్కయ్యారు. కేజ్రీవాల్‌పై దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన ఆప్ కార్యకర్తలు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనను ఆప్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.


    కేజ్రీవాల్‌పై దాడి జరగడం ఇది కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనపై పలుసార్లు దాడులు జరిగాయి. ఢిల్లీ సెక్రటేరియట్‌లో ఆయనపై కారంతో కొందరు దాడి చేశారు. 2016 అక్టోబర్‌లో ఆయనపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలు ఇంక్‌తో దాడి చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఓ వ్యక్తి ఢిల్లీలో ఓ వ్యక్తి కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఆయనపై బూటు విసిరారు. పంజాబ్ లూథియానాలో ఆయన కారుపై కొందరు రాళ్లతో దాడి చేశారు. 2016 జనవరిలో ఓ యువతి ఆయనపై ఇంక్‌తో దాడి చేసింది. అంతకుముందు ఏప్రిల్ 2014లో ఓ ఆటో డ్రైవర్ కూడా అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేశారు. ఆ దాడిలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. 2014 ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్‌ను ఓ వ్యక్తి వెనుక నుంచి దెబ్బకొట్టారు.


    First published:

    Tags: AAP, Arvind Kejriwal, Delhi

    ఉత్తమ కథలు