HOME »NEWS »NATIONAL »shloka akash ambani become parents to baby boy mk

Shloka, Akash Ambani Become Parents: ముఖేష్ అంబానీ కుటుంబానికి శుభవార్త...తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు...

Shloka, Akash Ambani Become Parents: ముఖేష్ అంబానీ కుటుంబానికి శుభవార్త...తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు...
ఆకాశ్, శ్లోక దంపతులు..

నీతా- ముఖేష్‌ అంబానీ దంపతులు బామ్మ- తాతయ్యలుగా మారినందుకు తమ సంతోషాన్ని వెల్లిబుచ్చారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ సతీమణి శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

  • Share this:
    రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో మరో వారసుడు అడుగుపెట్టాడు.  నీతా- ముఖేష్‌ అంబానీ దంపతులు నానమ్మ- తాతయ్యలుగా మారినందుకు తమ సంతోషాన్ని వెల్లిబుచ్చారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ సతీమణి శ్లోకా మెహతా ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు అంబానీ కుటుంబం గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా- ఆకాశ్‌ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి కుమారుడు జన్మించాడు. నీతా- ముఖేష్‌ అంబానీ మొదటిసారిగా నానమ్మ- తాతయ్య అయ్యారు. ధీరూభాయి- కోకిలాబెన్‌ మునిమనవడికి స్వాగతం పలికడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో మెహతా- అంబానీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది’’ అంటూ శుభవార్తను పంచుకుంది. కాగా గతేడాది మార్చిలో ఆకాశ్‌- శ్లోకాల వివాహం  వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో మూడు ముళ్ల బంధంతో వీరు ఒక్కటయ్యారు. శ్లోకా మెహతా వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కుమార్తె అన్న విషయం తెలిసిందే.



    ఇదిలా ఉంటే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంతానం తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియోను విస్తరించడంలో వీరు తమ కృషిని చాటుతున్నారు. ఇక టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లైన ఆయన కుమార్తె ఇషా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఇప్పటికే 2020 ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కించుకొని తమ సత్తా చాటారు.
    Published by:Krishna Adithya
    First published:December 10, 2020, 14:55 IST

    टॉप स्टोरीज