ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా శివసేన నినాదాలు

ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

news18-telugu
Updated: November 18, 2019, 5:09 AM IST
ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా శివసేన నినాదాలు
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
  • Share this:
మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఊహించని షాక్ తగిలింది. శివాజీ పార్క్‌ వెలుపల శివసేన కార్యకర్తలు ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్‌ ఠాక్రే 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం శివాజీ పార్క్‌కు సహచర బీజేపీ నేతలతో కలిసి ఫడ్నవీస్‌ వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు, బాల్‌ ఠాక్రే ప్రసంగాల వీడియోలను ట్వీటర్‌లో ఫడ్నవీస్‌ షేర్‌ చేశారు. ఉదయం పదిగంటల సమయంలో బాల్‌ ఠాక్రే కుమారుడు, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి శివాజీ పార్క్‌లో నివాళులర్పించగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాల్‌ ఠాక్రేకు నివాళులర్పించేందుకు ఫడ్నవీస్‌ శివాజీ పార్క్‌కు వెళ్లారు.

మరోవైపు ఛత్రపతి శివాజీ ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదని శివసేన వ్యాఖ్యానించింది. శివాజీ 11 కోట్ల మరాఠీలకు చెందినవాడని స్పష్టం చేసింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌తోక్‌ అనే తన కాలమ్‌లో పై వ్యాఖ్యలు చేశారు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>