NDAకి శివసేన గుడ్‌బై... రాజీనామా చేసిన అరవింద్ సావంత్

Maharashtra CM | మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న శివసేన... వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా... కేంద్రంలో తమ ఏకైక మంత్రి అరవింద్ సావంత్‌తో రాజీనామా చేయించి... NDA నుంచీ బయటకు వచ్చేసింది.

news18-telugu
Updated: November 11, 2019, 8:43 AM IST
NDAకి శివసేన గుడ్‌బై... రాజీనామా చేసిన అరవింద్ సావంత్
ఉద్ధవ్ థాక్రే, అమిత్ షా
  • Share this:
Maharashtra CM | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. NDAకి గుడ్‌బై చెప్పిన శివసేన... కేంద్రంలో తమ ఏకైక మంత్రి అరవింద్ సావంత్‌తో రాజీనామా చేయించింది. దీంతో... ఇక ఎన్టీయేకీ, శివసేనకీ సంబంధం తెగిపోయినట్లైంది. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన మరో అడుగు ముందుకు వేసినట్లైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ నిన్న క్లారిటీగా చెప్పేయడంతో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో లేదో నేటి రాత్రి 7.30లోపు చెప్పాలన్నారు. శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే... శివసేనతో కలిసేందుకు ఎన్సీపీ కొన్ని షరతులతో ఓకే అంటోంది. అదే సమయంలో... కాంగ్రెస్ కొన్ని షరతులతో బయటి నుంచీ మద్దతిస్తామని అంటోంది. అందువల్ల శివసేన తగినంత సంఖ్యాబలం లేకపోయినా... మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

తాజా లెక్కల్ని ఓసారి చూద్దాం : మహారాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య 288. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 145. బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు 56 స్థానాలు దక్కాయి. అవి రెండూ కలిసి ఉండి ఉంటే... అవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి. ఇప్పుడు సీన్ మారింది కాబట్టి... బీజేపీని పక్కన పెడదాం. ఎన్సీపీకి 54 సీట్లు రాగా... కాంగ్రెస్‌కి 44 వచ్చాయి. అందువల్ల శివసేన ఎన్సీపీ కలిస్తే (56+54) మొత్తం సీట్ల సంఖ్య 110 అవుతుంది. కాంగ్రెస్ బయటి నుంచీ మద్దతిస్తానంది కాబట్టి... కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వ సంఖ్యా బలం (110+44) 154 అవుతుంది. అందువల్ల శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

కండీషన్ల సంగతేంటి : శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే... సీఎం సీటుపై కన్నేశారు. అందువల్ల ఆ సీటుపై ఆయనే కూర్చునే అవకాశాలు ఉన్నాయి. నెక్ట్స్ ఉప ముఖ్యమంత్రి సీటుపై ఎన్సీపీ కన్నేసింది. అందువల్ల ఆ సీటును ఎన్సీపీకి ఇచ్చే ఛాన్సుంది. అదే జరిగితే... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొడుకు అజిత్ పవార్... డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్సుంది.

అలాగే ఎన్సీపీ... శివసేన NDA నుంచీ బయటకు రావాలనే కండీషన్ కూడా పెట్టింది. అవతల సీఎం సీటు రెడీగా ఉంటే... NDAకు గుడ్ బై చెప్పేందుకు శివసేన ఆలోచించలేదు. సరే అనేసింది. వెంటనే ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ నుంచీ తమ నేతతో రాజీనామా చేయించేసింది. సో... శివసేన అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి.



కాంగ్రెస్ కూడా ఓ కండీషన్ పెట్టింది. ఏంటంటే... స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంది. అందుకు శివసేన ఒప్పుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే... బలపరీక్ష టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడతారు. అప్పుడు సభలో సభ్యుల సంఖ్య తగ్గి... శివసేన-ఎన్సీపీ ప్రభుత్వం గట్టెక్కుతుంది.

 

Pics : హాట్ అందాల విందు చేస్తున్న త్రియాదాస్


ఇవి కూడా చదవండి :

అయోధ్య తీర్పు తర్వాత ఎంత మంది అరెస్టయ్యారో తెలుసా...?

జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలు

బెంగాల్‌పై బుల్‌బుల్ తుఫాను బీభత్సం... ఏడుగురు మృత్యువాత


ఆర్టీసీ సమ్మెపై నేడు ఫైనల్‌గా తేల్చనున్న హైకోర్టు...

క్లైమాక్స్‌కి మహారాష్ట్ర కహానీ... శివసేన సర్కార్ ఏర్పడే ఛాన్స్
First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు