HOME »NEWS »NATIONAL »shivsena bjp alliance for maharashtra assembly elections 2019 nk

మహారాష్ట్ర ఎన్నికలు... బీజేపీ, శివసేన మధ్య కుదిరిన డీల్

మహారాష్ట్ర ఎన్నికలు... బీజేపీ, శివసేన మధ్య కుదిరిన డీల్
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్

Maharashtra Assembly Elections 2019 : అధికారంలో ఉన్న కూటమికి... చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి. మరోసారి కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్న బీజేపీ, శివసేన పార్టీలు... కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

  • Share this:
    Maharashtra Assembly Elections 2019 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా... 24న ఫలితాలు రానున్నాయి. టైమ్ తక్కువగా ఉండటంతో... అధికార బీజేపీ, శివసేన వేగంగా పావులు కదుపుతున్నాయి. 288 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఈసారి బీజేపీ 144 సీట్లలో పోటీ చేయనుంది... శివసేన 126 స్థానాల్లో బరిలో దిగనుంది. మిగతా 18 స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీచేయనున్నాయని తెలిసింది. బీజేపీ చెబుతున్నదాని ప్రకారం... శివసేనకు ఈసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి దక్కబోతోందని తెలుస్తోంది. రెండు పార్టీలూ ఈసారి కలిసి పోటీచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించడంతో... సీట్ల సర్దుబాటుకి పార్టీలు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఆదివారం వచ్చే అవకాశాలున్నాయి.

    మహారాష్ట్ర ఎన్నికలకు ఎక్కువ టైమ్ లేదు. ఆల్రెడీ అధికారంలో ఉండటంతో... ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... గురువారం అంతర్గత సమావేశంలో దీనిపై చర్చించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. అభ్యర్థుల పేర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు, ఎవర్ని తప్పించాలి... వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది.



    నిజానికి శివసేన... 50-50 సీట్ షేరింగ్ ఉండాలని అనుకుంది. ఐతే... బీజేపీ పెద్దలు పావులు కదిపి... శివసేనను తమ దారికి తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు... బీజేపీ, శివసేన తమ పొత్తుకు బ్రేక్ చెప్పి... విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించినా... మెజార్టీ మార్కుకు వెనకబడింది. ఆ తర్వాత శివసేనతో మళ్లీ చేతులు కలిపింది. ఈసారి మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ గెలుస్తుందన్న అంచనాలో ఉన్న శివసేన... ఆ పార్టీతో కలిసి సాగేందుకే సిద్ధపడింది. ప్రధానంగా... జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు... మళ్లీ తమ కూటమినే గెలిపిస్తాయని శివసేన బలంగా నమ్ముతోంది. సీట్ల సర్దుబాటు పూర్తవడంతో... ఇక ఆ పార్టీ ఇప్పుడు... అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తోంది.

    మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 8తో ముగుస్తుంది. మహారాష్ట్రలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 288 ఉండగా... బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా పార్టీలు 20 సీట్లు గెలుచుకున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో... 15 ఏళ్ల పొత్తులను వదులుకొని... కాంగ్రెస్, ఎన్సీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. కారణం సీట్ల షేరింగ్‌లో రెండు పార్టీలకు సెట్ కాలేదు. అదే సమయంలో... బీజేపీ సింగిల్‌గానే బరిలో దిగి... 122 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అలాగే శివసేన ఒంటరిగా పోటీ చేసి... 63 సీట్లు సాధించింది.

    ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ ఆల్రెడీ అనధికారికంగా సీట్ల షేరింగ్ చేసుకున్నాయి. కాంగ్రెస్ 123, ఎన్సీపీ 125 సీట్లలో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఇటీవలే ప్రకటించారు. మిగతా 41 స్థానాల్లో ఇతర మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. రెండు పార్టీల మధ్యా కుదిరిన ఏకాభిప్రాయంతోనే సీట్ల సర్దుబాటు జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 104 మందితో తొలి జాబితా రెడీ చేసుకుంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్‌తోపాటూ... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్ పేర్లు కూడా ఉన్నాయి.

    ఏప్రిల్-మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో... కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకోగా, ఎన్సీపీ 4 సాధించింది. బీజేపీ 23, దాని మిత్రపక్షం శివసేన 18 స్థానాలు సాధించాయి.
    Published by:Krishna Kumar N
    First published:September 27, 2019, 10:11 IST