పొడుగు కాళ్ల సుందరిని పొగిడిన మాజీ సీఎం

సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతకు ఇది ఒక నిదర్శనమంటూ కొనియాడారు. మిగతా సెలబ్రిటీలు కూడా శిల్పాశెట్టిలాగే ఆలోచించాలన్నారు.

news18-telugu
Updated: August 20, 2019, 7:36 AM IST
పొడుగు కాళ్ల సుందరిని పొగిడిన మాజీ సీఎం
సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతకు ఇది ఒక నిదర్శనమంటూ కొనియాడారు. మిగతా సెలబ్రిటీలు కూడా శిల్పాశెట్టిలాగే ఆలోచించాలన్నారు.
news18-telugu
Updated: August 20, 2019, 7:36 AM IST
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టిపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఓ ఆయుర్వేద కంపెనీ శిల్పను సంప్రదించింది. తాము ఉత్పత్తి చేసే స్లిమ్మింగ్‌పిల్‌కు ప్రచారం నిర్వహించాలని కోరింది. అందుకు భారీ పారితోషకాన్ని కూడా ప్రకటించింది. రూ. పది కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. అయితే, ఈ ఆఫర్‌ను శిల్ప సున్నితంగా తిరస్కరించింది. తాను నమ్మని విషయాలకు ప్రచారం చేయలేనని కరాఖండిగా చెప్పేసింది. అంతేకాదు, మనం తీసుకునే ఫుడ్‌లో కాస్త డైట్ ఫాలో అయితే... కాస్త ఆలస్యంగానైనా సన్నబడవచ్చని తెలిపింది ఈ యోగా బ్యూటీ

దీంతో శిల్పశెట్టి చేసిన ఈ పనికి  అంతా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్‌లో చాలామంది శిల్పది సరైన నిర్ణయమంటూ కొనియాడుతున్నారు. బాధ్యతగా వ్యవహరించి రూ.10 కోట్ల ఆఫర్‌ను వదిలేసుకున్న శిల్పపై సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. శిల్ప నిర్ణయం భేష్ అంటూ కొనియాడారు. స్లిమ్మింగ్ పిల్స్ ఫలితాలపై నమ్మకం లేని ఆమె బాధ్యతగా వ్యవహరించి రూ.10 కోట్ల ఆఫర్‌ను వదిలేసుకున్నారని, ఆమె తీరు అభినందనీయమని ప్రశంసించారు. సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతకు ఇది ఒక నిదర్శనమంటూ కొనియాడారు. మిగతా సెలబ్రిటీలు కూడా శిల్పాశెట్టిలాగే ఆలోచించాలన్నారు. అవాస్తవమైన ప్రచారాలకు సెలబ్రిటీలు దూరంగా ఉండాలని సూచించారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...