SHIV SENA MOVES SC AGAINSTA GOVERNOR CALL FOR FLOOR TEST PVN
మహా ట్విస్ట్ : సుప్రీంకోర్టుకి శివసేన...ఇప్పుడుంటది అసలు కథ..5గంటలకు ఏం జరగబోతుంది!
సుప్రీంకోర్టు
Shiv Sena Moves Supreme Court : మహారాష్ట్ర(Maharashtra)రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మహా రాజకీయ ప్రతిష్ఠంభనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో మెజార్టీ (Floor Test)నిరూపించుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) నేతృత్వంలోని "మహా వికాస్ అఘాడీ" ప్రభుత్వాన్ని మహారాష్ట్ర గవర్నర్(Maharashtra Governor) భగత్ సింగ్ కొశ్యారీఆదేశించిన నేపథ్యంలో ..భగత్ సింగ్ కొశ్యారీ ఆదేశాలను సవాల్ శివసేన(Shiv Sena) సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది.
Shiv Sena Moves Supreme Court : మహారాష్ట్ర(Maharashtra)రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మహా రాజకీయ ప్రతిష్ఠంభనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో మెజార్టీ (Floor Test)నిరూపించుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) నేతృత్వంలోని "మహా వికాస్ అఘాడీ" ప్రభుత్వాన్ని మహారాష్ట్ర గవర్నర్(Maharashtra Governor) భగత్ సింగ్ కొశ్యారీఆదేశించిన నేపథ్యంలో ..భగత్ సింగ్ కొశ్యారీ ఆదేశాలను సవాల్ శివసేన(Shiv Sena) సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రెండు రోజుల క్రితం జారీ చేసిన అనర్హత నోటీసులపై 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా సమాధానమే ఇవ్వలేదని... అనర్హతపై తేలకుండానే బలపరీక్షకు సిద్ధమవ్వాలంటూ గవర్నర్ కోరడం చట్టవిరుద్ధమని శివసేన తెలిపింది. ఈ మేరకు శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభు పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనాన్ని కోరారు శివసేన తరుపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. అయితే బలనిరూపణ ఆదేశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండా ఎలా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో సాయంత్రంలోగా అందజేస్తామని శివసేన తరుపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవరస విచారణకు ధర్మాసనం అంగీకరించింది. సాయంత్రం ఐదు గంటలకు పిటినషన్ను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్నాథ్ షిండే(Eknath Shinde)నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు..గత వారం రోజుల నుంచి అసోం(Assam)లోని గౌహతిలో బస చేస్తున్న విషయం తెలిసిందే. వారం నుంచి హోటల్లోనే ఉన్న ఏక్నాథ్ షిండే బృందం ఇవాళ ఉదయం కామాఖ్య(Kamakya Temple)అమ్మవారిని దర్శించుకున్నారు. గౌహతిలో ఉన్న శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏక్నాథ్ షిండే పూజలు నిర్వహించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతి చేరుకున్నప్పటి నుంచి వారితోనే ఉంటున్న అసోంబీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోహెయిన్, ఇద్దరు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వెంట కలిసి ఆలయానికి వచ్చారు. మహారాష్ట్ర ప్రజల తరపున కామాఖ్యకు పూజలు చేసినట్లు ఏక్నాథ్ తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో రేపు జరిగే బలపరీక్షకు తాను హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం ఉద్దవ్ తన బలాన్ని రేపటి సాయంత్రంలోగా నిరూపించుకోవాలని గవర్నర్ కోశియారి ఆదేశించిన నేపథ్యంలో ఆ ఫ్లోర్ టెస్ట్‌కు హాజరుకానున్నట్లు షిండే తెలిపారు. రేపు ఉదయం రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ముంబై చేరుకోనున్నారని సమాచారం. మరికాసేపట్లో గోవాకు చేరుకోనున్న ఎమ్మెల్యేలు.. కలిసికట్టుగానే రేపు అక్కడినుంచి ముంబైకి విమానంలో వచ్చి అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.