• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SHIV SENA ACTIVIST ACCUSES NETFLIX OF DEFAMING HINDUS GLOBALLY FILES POLICE COMPLAINT MS

#BanNetflixIndia : నెట్‌ఫ్లిక్స్‌ను ఇండియాలో నిషేధించాలని డిమాండ్.. ఎందుకంటే..?

#BanNetflixIndia : నెట్‌ఫ్లిక్స్‌ను ఇండియాలో నిషేధించాలని డిమాండ్.. ఎందుకంటే..?

ప్రతీకాత్మక చిత్రం

Ban Netflix in India : ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ట్విట్టర్‌లో దానిపై వ్యతిరేకత వ్యక్తమైంది.దాంతో ట్విట్టర్‌ను కూడా నిషేధించాలన్న డిమాండ్ వినిపించింది. ఇప్పుడదే తరహాలో నెట్‌ఫ్లిక్స్‌ను కూడా నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి రావడం గమనార్హం.

  • Share this:
    ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ను భారత్‌లో నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న కొన్ని వెబ్ సిరీస్‌ల ద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని శివసేన ఐటీ సెల్ ముంబైలోని ఎల్‌టీ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెబ్‌ సిరీస్‌లు సాక్రెడ్ గేమ్స్, లీలా&గౌల్, హసన్ మింజా స్టాండప్ కామెడీ షో వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌కు అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొంది.

    నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌కు తీవ్రమైన హిందూ ఫోబియా ఉంది.అందుకే దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అధికారులు అందులో ప్రసారమవుతున్న కంటెంట్‌పై దృష్టి సారించాలి. నెట్‌ఫ్లిక్స్ లైసెన్స్‌ను రద్దుచేసి తగిన చర్యలు తీసుకోవాలి. ఒక బూటకపు అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని.. దాన్ని మతానికి ఆపాదించి సాధారణీకరించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలి.
    రమేష్ సోలంకి,శివసేన


    ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ట్విట్టర్‌లో దానిపై వ్యతిరేకత వ్యక్తమైంది.దాంతో ట్విట్టర్‌ను కూడా నిషేధించాలన్న డిమాండ్ వినిపించింది. ఇప్పుడదే తరహాలో నెట్‌ఫ్లిక్స్‌ను కూడా నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి రావడం గమనార్హం.ప్రస్తుతం ట్విట్టర్‌లో ఇదే విషయం ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ నిషేధం డిమాండ్‌పై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
    First published:

    అగ్ర కథనాలు