బస్సు డ్రైవర్లు, స్థానికుల ఘర్షణ..షిల్లాంగ్‌లో కర్ఫ్యూ..!

news18
Updated: June 6, 2018, 6:13 PM IST
బస్సు డ్రైవర్లు, స్థానికుల ఘర్షణ..షిల్లాంగ్‌లో కర్ఫ్యూ..!
షిల్లాంగ్‌లో హింస చెలరేగడంతో భారీగా మోహరించిన పోలీసులు
  • News18
  • Last Updated: June 6, 2018, 6:13 PM IST
  • Share this:
మేఘాలయా రాజధాని షిల్లాంగ్ అల్లర్లతో అట్టుడికింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా .. అక్కడ హింస చెలరేగింది. దీంతో షిల్లాంగ్‌లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ  విధించారు. మరికొన్నిచోట్ల 144 సెక్షన్ విధించి.. పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను రప్పించారు.

ఏం జరిగింది?

గురువారం ఉదయం షిల్లాంగ్‌లోని థెమ్‌ మాల్వాంగ్ ప్రాంతలో ఓ బస్సు కండక్టర్‌పై స్థానికులు దాడిచేసినట్లు తెలిసింది. అనంతరం బస్సు డ్రైవర్లు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగి.. అది ఘర్షణకు జరిగింది. ఐతే డ్రైవర్ల దాడిలో ఓ యువకుడు చనిపోయినట్లు పుకార్లు రావడంతో.. స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. బస్సు డ్రైవర్లపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు, బస్సు డ్రైవర్లపై స్థానికులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి తీవ్ర  ఉద్రిక్తంగా  మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి.. లాఠీచార్జ్ చేశారు.   దాడిలో  పోలీసులు, బస్సు డ్రైవర్లకు గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి అదుపు తప్పడంతో షిల్లాంగ్‌కు అదనపు బలగాలను రప్పించారు. జీఎస్ రోడ్డు సమీపంలో బ్యారీకేడ్లను ఏర్పాటుచేసి లోపలికి వాహనాలను నిలిపివేశారు. అటు మోటఫ్రాన్ ప్రాంతంలోనూ చెక్‌పోస్ట్ పెట్టి బయటికి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. రాత్రంతా రోడ్లపైనే పోలీసులు పహారా కాశారు. అనంతరం ఉదయం జైవా, మవ్‌ఖర్, ఉమ్‌సోసున్, రైసమ్‌తియా, వాషింగ్‌డో, మిషన్, మాప్రెమ్, లుమ్‌డింగ్రి, లామా విల్లా, క్వాలాపత్తి, వాహ్‌తాబ్రు, సన్నీ హిల్స్, కంటోన్మెంట్, మావ్లాంగ్‌హాట్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
Published by: Shiva Kumar Addula
First published: June 1, 2018, 6:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading