రూ.500తో షీలా దీక్షిత్ అంత్య క్రియలు ఎందుకో తెలుసా ?

హంగు ఆర్భాటం లేకుండా తన అంత్యక్రియలు కేవలం రూ.500 ఖర్చుతో మాత్రమే జరపాలని ఆమె చివరి కోరికగా కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే షీలా పార్థివ దేహాన్ని సీఎన్‌జీ గ్యాస్ ద్వారా దహనం చేశారు.

news18-telugu
Updated: July 22, 2019, 6:31 PM IST
రూ.500తో షీలా దీక్షిత్ అంత్య క్రియలు ఎందుకో తెలుసా ?
(ఫైల్ చిత్రం)
  • Share this:
సీనియర్ రాజకీయ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్య క్రియలకు కేవలం రూ.500 మాత్రమే ఖర్చు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దిల్లీ లాంటి రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడంతో పాటు, దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరిగా పేరొందిన షీలా దీక్షిత్ అంత్యక్రియలు అత్యంత నిరాడంబరంగా సాగాయి. అయితే ఇలా హంగు ఆర్భాటం లేకుండా తన అంత్యక్రియలు కేవలం రూ.500 ఖర్చుతో మాత్రమే జరపాలని ఆమె చివరి కోరికగా కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే షీలా పార్థివ దేహాన్ని సీఎన్‌జీ గ్యాస్ ద్వారా దహనం చేశారు. అయితే సీఎన్‌జీ గ్యాస్‌తో పార్థివ దేహాన్ని దహనం చేయాలనే షీలా కోరిక వెనుక పర్యావరణ పరిరక్షణ ఉద్దేశ్యం బలంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

దిల్లీలో పొగ వలన వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, అయితే తన పార్థివ దేహాన్ని కట్టెలతో కాల్చితే రూ.1000 ఖర్చుతో పాటు పొగతో కాలుష్యం కూడా ఏర్పడుంది. అదే సీఎన్‌జీ వాడకం ద్వారా కేవలం రూ.500 మాత్రమే ఖర్చు అవడంతో పాటు పర్యావరణంలో ఎలాంటి పొగ ఏర్పడకుండా పార్థివ దేహం దహనమవుతుందనే గొప్ప ఉద్దేశ్యం షీలా చివరి కోరికలో దాగి ఉందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు