ఢిల్లీ సీఎంను లంచ్‌కి ఆహ్వానించిన షీలా దీక్షిత్... కేజ్రీవాల్ రియాక్షన్ ఇదీ...

Lok Sabha Election 2019 : కేజ్రీవాల్‌ని షీలా దీక్షిత్ భోజనానికి రమ్మని పిలవడం వెనక రాజకీయ ఎత్తుగడ ఉందా... ఫలితాల తర్వాత ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటారా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 12, 2019, 11:24 AM IST
ఢిల్లీ సీఎంను లంచ్‌కి ఆహ్వానించిన షీలా దీక్షిత్... కేజ్రీవాల్ రియాక్షన్ ఇదీ...
షీలా దీక్షిత్, అరవింద్ కేజ్రీవాల్ (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 12, 2019, 11:24 AM IST
ఢిల్లీలో మొత్తం 7 లోక్ సభ స్థానాలకూ ఒకే రోజున ఆరో దశలో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్... ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను భోజనానికి ఆహ్వానించారు. షీలా దీక్షిత్ ఆరోగ్యం సరిగా లేదంటూ ఈమధ్య కేజ్రీవాల్, ఆమ్ ఆద్మా పార్టీ వాలంటీర్లు ట్విట్టర్‌లో తరచూ కామెంట్లు పెడుతున్నారు. ఆరోగ్యంగా లేకపోవడం వల్లే షీలా దీక్షిత్ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొన లేకపోతున్నారని ఊదరగొడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? పుకార్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ... కావాలంటే మా ఇంటికి రండి... వచ్చి భోజనం చెయ్యండి. అదే సమయంలో నేనెంత ఆరోగ్యంగా ఉన్నానో తెలుసుకోండి అని ఆహ్వానిస్తూ ట్విట్టర్‌లో హిందీ ట్వీట్ పెట్టారామె.

ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన షీలా దీక్షిత్... ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచీ పోటీ చేస్తున్నారు. షీలా ట్వీట్‌కి పాజిటివ్‌గా స్పందించారు కేజ్రీవాల్. తాను షీలా ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఏమీ అనలేదన్న ఆయన... పెద్దల్ని గౌరవించాలని తన కుటుంబం తనకు నేర్పిందన్నారు. షీలాను దేవుడు చల్లగా చూడాలనీ, సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోజనానికి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అని రిప్లై ఇచ్చారు.లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రయత్నించాయి. ఐతే సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీలకూ సఖ్యత కుదరలేదు. దాంతో వేటికవే పోటీ చేశాయి. మరోవైపు షీలా దీక్షిత్‌ ఆరోగ్యంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ... ఢిల్లీ జఫరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది.

 

ఇవి కూడా చదవండి :

ఏపీలో కింగా, కింగ్ మేకరా... నేడు తేల్చనున్న పవన్ కళ్యాణ్...

IPL Final Match : ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమైన CSK, MI... జోరుగా బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందా

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

 
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...