Home /News /national /

శశి థరూర్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

శశి థరూర్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

శశిథరూర్

శశిథరూర్

రచయిత,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ-2019 అవార్డు లభించింది.థరూర్ రచించిన 'ఆన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్ : ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా' పుస్తకానికి ఈ పురస్కారం లభించింది.

    రచయిత,కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ-2019 అవార్డు లభించింది.థరూర్ రచించిన 'ఆన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్ : ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా' పుస్తకానికి ఈ పురస్కారం లభించింది.2016లో ఆయన ఈ పుస్తకాన్ని ప్రచురించారు. బ్రిటీష్ హయాంలో ఉన్న పరిస్థితులు, వలసపాలకులు దేశాన్ని దోచుకున్న తీరును థరూర్ కళ్లకు కట్టినట్టుగా రాశారు. థరూర్ రచించిన 'వై ఐయామ్ ఏ హిందూ', 'పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్' వంటి రచనలు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

    కాగా,మొత్తం 23 భాషల్లో ఉత్తమ రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించగా అందులో శశి థరూర్ ఒకరు. తెలుగు
    నుంచి రాయలసీమ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన శప్తభూమి
    పుస్తకానికి గాను అవార్డు ప్రకటించారు. శప్తభూమి రాయలసీమ నేపథ్యంగా సాగే నవల. నారాయణస్వామికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల రచయితల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Central literature academy awards, Kerala, Shashi tharoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు