హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress President Poll: శశిథరూర్ vs మల్లికార్జున ఖర్గే..కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిది?

Congress President Poll: శశిథరూర్ vs మల్లికార్జున ఖర్గే..కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిది?

శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే (ఫైల్)

శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే (ఫైల్)

Congress: కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిది? ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుండి అగ్ర నాయకుల వరకు వారి మదిలో మెదులుతున్న ప్రశ్న. అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయడం, రాహుల్ గాంధీ మొగ్గు చూపకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Delhi, India

  కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిది? ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుండి అగ్ర నాయకుల వరకు వారి మదిలో మెదులుతున్న ప్రశ్న. అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయడం, రాహుల్ గాంధీ మొగ్గు చూపకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే పలుసార్లు రాహుల్ గాంధీ బహిరంగంగానే నేను పోటీ చేయనని స్పష్టం చేశారు. అలాగే రేసులో ప్రధాన అభ్యర్థిగా ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లూత్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఇక నేను పోటీలో ఉన్నా అంటూ ముందుకొచ్చిన మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం ఎవరిదనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. దీనితో పోటీలో ద్విముఖ పోరు ఖాయంగా కనిపిస్తుంది.

  ఇప్పటివరకు శశిథరూర్, మల్లికార్జున ఖర్గే మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు 8వ తేదీ గడువు కాగా అప్పటివరకు వీరిద్దరిలో ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటారా లేక ఇద్దరు పోటీలో నిలుస్తారో చూడాలి. ఒకవేళ ఇద్దరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే మిగిలిన వ్యక్తి ఏకగ్రీవ ఎన్నిక కాబడతాడు. ఒకవేళ ఇద్దరు పోటీలో ఉంటే మాత్రం అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించి 19వ తేదీన కొత్త అధ్యక్షుడుని ప్రకటిస్తారు.

  కాగా పోటీలో ఉన్న శశిథరూర్ తో పోలిస్తే మల్లికార్జున ఖర్గేకు ఎక్కువ మద్దతు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. మల్లికార్జున ఖర్గే దళిత వర్గానికి చెందిన నేత. అలాగే క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి కావాల్సిన అనుభవం ఆయనకు ఉంది. ఇక శశిథరూర్ ఉన్నతవర్గానికి చెందిన వ్యక్తి. మంచి వ్యక్తి, ఆలోచనలు బాగున్నప్పటికీ ఖర్గేకు ఎక్కువ మద్దతు ఉంటుందని సమాచారం. అయితే అసలు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అసలు పోటీనే లేదని భావించగా తాజాగా ద్విముఖ పోరు నెలకొనడం ఆసక్తికరంగా మారింది.

  ఇక ఇటీవల రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయపూర్ లోని చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయం ‘ఒకే వ్యక్తి ఒకే పదవి’ అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ అధక్ష పీఠం ఒక సంస్థాగత పదవే కాదు. సైద్ధాంతిక, నమ్మకమైన వ్యవస్థ. ఆ పదవి ఆలోచన సమూహం అన్నారు. మీరు చారిత్రాత్మక స్థానంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ స్థానం దేశ ఆకాంక్షను ప్రతిబింబించింది. ఇకపై ప్రతిబింబిస్తుందని అన్నారు.

  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Congress, Delhi, Mallikarjun Kharge, Shashi tharoor

  ఉత్తమ కథలు