శరద్ పవార్ మరో ఎత్తుగడ... CAAతో బీజేపీకి చెక్

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుతో రాజకీయాలకు చెక్ పడలేదు. తాజాగా CAA విషయంలోనూ తన పంతం నెగ్గించుకుంటున్నారు శరద్ పవార్.

news18-telugu
Updated: December 22, 2019, 5:55 AM IST
శరద్ పవార్ మరో ఎత్తుగడ... CAAతో బీజేపీకి చెక్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
  • Share this:
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత హడావుడిగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి... తమ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్... బీజేపీ, శివసేన మధ్య కచ్చితమైన అడ్డుపుల్ల వేశారు. ఇక ఇప్పట్లో ఆ రెండు పార్టీలూ మళ్లీ మిత్రపక్షాలు అయ్యే ఛాన్స్ లేకుండా చేశారు. ఐతే... కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును శివసేన ఆమోదించడంతో అలర్టైన శరద్ పవార్... తెరవెనక పావులు కదిపారు. అంతే... అదే బిల్లు రాజ్యసభలోకి రాగానే శివసేన ఎంపీలు వ్యతిరేకించారు. తద్వారా మరోసారి శరద్ పవార్ బీజేపీకి చెక్ పెట్టినట్లైంది. ఐతే... శివసేన లోక్ సభలో ఈ బిల్లును ఆమోదించడంపై ఇప్పటికీ శరద్ పవార్ అసంతృప్తితోనే ఉన్నారు. కారణం ఆ బిల్లు చట్టంగా మారడమే. ఇప్పుడాయన తాజాగా మరో ఎత్తుగడ వేశారు. ఈ చట్టాన్ని మహారాష్ట్రలో అమలవ్వకుండా చేస్తే... బీజేపీకి మళ్లీ చెక్ పెట్టినట్లవుతుందని భావిస్తూ... ఈ చట్టాన్ని తిరస్కరించాలని పిలుపిచ్చారు. ఈ పౌరసత్వ చట్టం ద్వారా దేశంలో మత, సామాజిక సామరస్యం దెబ్బతింటుందనే కారణాన్ని ఆయన చెబుతున్నారు.

శివసేన నడుపుతున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్‌తోపాటూ... NCP కూడా మిత్రపక్షంగా ఉంది. ఈ బిల్లును కాంగ్రెస్‌తోపాటూ... NCP కూడా లోక్‌సభ, రాజ్యసభలో వ్యతిరేకించింది. అంతేకాదు... NDAలో భాగస్వామిగా ఉన్న పార్టీ పాలిస్తున్న బీహార్ సహా ఎనిమిది రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చెయ్యడానికి తిరస్కరించాయి. బీహార్, కేరళ, పంజాబ్, బెంగాల్, రాజస్థాన్ ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. అమలు చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఈ లిస్టులో మహారాష్ట్ర కూడా చేరితే బీజేపీకి షాకే అవుతుంది. ఇలా చట్టాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని బీజేపీ టార్గెట్ చేస్తుందనే భయాందోళనలు ఉన్నాయన్న శరద్ పవార్... శివసేనపై ఒత్తిడి తెస్తున్నారు. ఐతే... ఈ చట్టం అమలు... సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పడం ద్వారా శివసేన జాగ్రత్తగా పావులు కదుపుతోందని అనుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: December 22, 2019, 5:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading