Home /News /national /

SHARAD PAWAR CONGRATULATES NEW GOVERNMENT SAYS FADNAVIS WAS UNHAPPY PVN

Sharad pawar :  భారీ ప్రిపరేషన్ తర్వాతనే షిండే సీఎం..అసంతృప్తిగానే ఫడ్నవీస్!

శరద్ పవార్ (పాత ఫొటో)

శరద్ పవార్ (పాత ఫొటో)

Sharad pawar congratulates new government : నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) మహారాష్ట్ర కొత్త సీఎంగా(Maharashtra CM)గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్ భవన్ లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమలో షిండే చేత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు.

ఇంకా చదవండి ...
Sharad pawar congratulates new government : నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) మహారాష్ట్ర కొత్త సీఎంగా(Maharashtra CM)గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్ భవన్ లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమలో షిండే చేత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేయడంపై నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) చీఫ్‌ శరద్‌ పవార్‌(Sharad Pawar) స్పందించారు.

గురువారం రాత్రి మీడియాతో పవార్ మాట్లాడుతూ..."ఏక్‌నాథ్ షిండే కొత్త బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్ద సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేలను గౌహతికి తీసుకెళ్లి సత్తా చూపించాడు. శివసేన నుంచి బయటకు వచ్చేలా ప్రజలను ప్రేరేపించాడు. ప్రిపరేషన్ లేకుండా ఇది జరగలేదు. నేను ఏకనాథ్ షిండేతో మాట్లాడి నా శుభాకాంక్షలు తెలియజేసాను. ఒక రాష్ట్రానికి అధిపతి ఒక పార్టీకి మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికి నాయకత్వం వహించాలనే నా అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసాను. షిండే పార్టీకి ప్రాతినిధ్యం వహించవచ్చు కానీ ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి అన్ని శాఖల సమస్యలను పరిష్కరించడానికి ఆయన కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఉద్ధవ్ ఠాక్రే ఎవరినైనా విశ్వసించిన తర్వాత పూర్తి బాధ్యత వారికి అప్పగిస్తారని నేను భావిస్తున్నాను. ఏకనాథ్ షిండేపై అదే నమ్మకాన్ని చూపి ఆయనకు విధానసభ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు అప్పగించారు. అది (రాజకీయ సంక్షోభం) దాని ఫలితమేమో నాకు తెలియదు. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం నంబర్ 2 పదవిని సంతోషంగా అంగీకరించాడని నేను అనుకోను. అది అతని ముఖంలో కనిపిస్తుంది. కానీ అతను నాగ్‌పూర్‌లో నివసించాడు, అది (RSS)గడ్డ. స్వయంసేవక్‌గా అతని బాధ్యత కాబట్టి అతను ఆ పదవిని అంగీకరించాడు"అని అన్నారు.

Congress: మహారాష్ట ఎపిసోడ్.. కాంగ్రెస్‌కు కూడా పెద్ద దెబ్బ.. ఇక మిగిలింది..

షిండేను సీఎంగా ప్రకటించిన ఫడ్నవీస్‌, ప్రభుత్వంలో తాను భాగం కావడం లేదని చెప్పిన విషయాన్ని శరద్‌ పవార్‌ గుర్తు చేశారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒత్తిడితో ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. షిండేతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లిన వారంతా కూడా ఆయనతో సహా డిప్యూటీ సీఎం పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారని శరద్‌ పవార్‌ తెలిపారు. అయితే బీజేపీ ఏకంగా సీఎం పదవిని ఆఫర్‌ చేస్తుందని షిండే అయినా ఊహించి ఉండరని అన్నారు.

మరోవైపు.ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ ముగిసిపోలేదని శరద్‌ పవర్‌ తెలిపారు. శివసేనలో గతంలో కూడా ఇలాంటి తిరుగుబాట్లు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు. ఛగన్ భుజబల్, నారాయణ్‌ రాణే వంటి నేతలు కూడా శివసేనలో తిరుగుబాటు చేసి అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారన్నారు

ఇక, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఓ ట్వీట్ లో...మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ లకు నా శుభాకాంక్షలు. మీ ఇద్దరి ద్వారా మహారాష్ట్రలో మంచి పనులు జరుగుతాయని ఆశిస్తున్నాను"అని పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra, Sharad Pawar

తదుపరి వార్తలు