ఆరు గంటలు నరకం అనుభవించాం..: ఇండిగోపై మండిపడుతున్న ప్రయాణికులు

విమానం ఆలస్యంగా బయలుదేరిన ఘటనపై ఎట్టకేలకు ఇండిగో స్పందించింది. వర్షాల కారణంగా మొత్తం 30 విమానాల రాకపోకలు రద్దయినట్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తడంతో తమ సిబ్బంది ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోలేకపోయారని తెలిపింది.

news18-telugu
Updated: September 5, 2019, 5:29 PM IST
ఆరు గంటలు నరకం అనుభవించాం..: ఇండిగోపై మండిపడుతున్న ప్రయాణికులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బుధవారం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ విమానం ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 3.15గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం రాత్రి 9.55గంటలకు బయలుదేరింది. ఆ ఆరు గంటలు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వారు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. 'ఆరు గంటల నుంచి విమానం ఇంకా కదలట్లేదు. ప్రయాణికులనైనా విమానం నుంచి బయటకు పంపించండి.. లేదా విమానం అయినా బయలుదేరేలా చేయండి' అంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు.ఇండిగో చేసిన పనికి ఆరు గంటల పాటు ఆకలి దప్పులతో అలాగే ఉండిపోవాల్సి వచ్చిందని.. ఒకరకంగా నరకం అనుభవించామని వాపోయారు. ఆ సంస్థ లైసెన్స్ రద్దు చేయాలని సోషల్ మీడియాలో వారు డిమాండ్ చేస్తున్నారు.

విమానం ఆలస్యంగా బయలుదేరిన ఘటనపై ఎట్టకేలకు ఇండిగో స్పందించింది. వర్షాల కారణంగా మొత్తం 30 విమానాల రాకపోకలు రద్దయినట్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తడంతో తమ సిబ్బంది ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోలేకపోయారని తెలిపింది.
First published: September 5, 2019, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading