Home /News /national /

క్లాస్‌రూమ్‌లో పాము కాటు.. టీచర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి

క్లాస్‌రూమ్‌లో పాము కాటు.. టీచర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి

షెరిన్

షెరిన్

స్కూలుకు వెళ్లిన షెరిన్ తరగతి గదిలో ఉన్న ఓ రంధ్రంలో పొరపాటున కాలు పెట్టింది. ఐతే అందులో ఉన్న పాము ఆ చిన్నారిని కాటేసింది. ఈ విషయాన్ని ఆమెతో పాటు తోటి విద్యార్థులు కూడా గమనించలేదు.

    కేరళలోని వయనాడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్లాస్‌రూమ్‌లో పాము కాటుకు గురై విద్యార్థి చనిపోయింది. ఎస్ శాహ్లా షెరిన్ (10) అనే విద్యార్థిని సుల్తాన్ బాథరీ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. రోజూలాగే బుధవారం స్కూలుకు వెళ్లిన షెరిన్ తరగతి గదిలో ఉన్న ఓ రంధ్రంలో పొరపాటున కాలు పెట్టింది. ఐతే అందులో ఉన్న పాము ఆ చిన్నారిని కాటేసింది. ఈ విషయాన్ని ఆమెతో పాటు తోటి విద్యార్థులు కూడా గమనించలేదు. కాలికి రక్తపు మరకలు కనిపించడంతో షెరిన్ కంగారు పడింది. ఐతే ఏదో చిన్న రాయి తగిలి ఉంటుందని బావించిన టీచర్.. కాలుకి బ్యాండేజ్ వేసి క్లాస్‌రూమ్‌లోనే కూర్చోబెట్టారు. కాసేపటికి షెరిన్ కళ్లు తిరిగి కిందపడిపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

    పేరెంట్స్ స్కూల్‌కు చేరుకొని.. ఆ చిన్నారిని అక్కడి నుంచి హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షెరిన్ పరిస్థితి విషమించడంతో కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు. దాంతో దిక్కుతోచని స్థితిలో వయనాడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది సేపటి తర్వాత షెరిన్ చికిత్స పొందుతూ చనిపోయింది. టీచర్ నిర్లక్ష్యంగా వ్యహరించడం వల్లే చిన్నారి చనిపోయిందని షెరిన్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి, వయనాడ్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. సదరు టీచర్‌ను సస్పెండ్ చేసి ఘటనప పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

    First published:

    Tags: Kerala, Snake bite

    తదుపరి వార్తలు