Home /News /national /

SHADNAGAR ENCOUNTER POLICE SHOULD BE INVESTIGATED DEMAND PRAKASH AMBEDKAR SK

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌ని తప్పుబట్టిన అంబేద్కర్ మనవడు

ప్రకాశ్ అంబేద్కర్

ప్రకాశ్ అంబేద్కర్

రాజకీయ నేతలు తప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై విచారణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

  షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌ని దేశమంతా ప్రశంసిస్తున్న వేళ.. పలు పార్టీలకు చెందిన కొందరు నేతలు మాత్రం తప్పుబట్టుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ పోలీసుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఆ లిస్టులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ చేరారు. షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

  '' ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారంతా నిందితులే. దోషులు కాదు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో 36 మంది అనుమానిత నక్సలైట్లు చనిపోయారు. వాస్తవానికి వారు నక్సలైట్లు కాదు. రాజకీయ నేతలు తప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఇది కరెక్టు కాదు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై విచారణ జరగాలి.'' అని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Disha murder case, Shadnagar encounter, Telangana, Telangana Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు