• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SHABNAM ALI SON ASKS PRESIDENT FOR MERCY PLEASE FORGIVE MY MOTHER SU

రాష్ట్రపతి అంకుల్ మా అమ్మ ఉరి శిక్షను అడ్డుకోండి.. కన్నీళ్లు పెట్టుకున్న షబ్నమ్ కొడుకు

రాష్ట్రపతి అంకుల్ మా అమ్మ ఉరి శిక్షను అడ్డుకోండి.. కన్నీళ్లు పెట్టుకున్న షబ్నమ్ కొడుకు

షబ్నమ్(ఫైల్ ఫొటో)

స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటి సారిగా ఒక మహిళ దోషి ఉరికంబం ఎక్కబోతోంది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని మథుర జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Share this:
    స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటి సారిగా ఒక మహిళ దోషి ఉరికంబం ఎక్కబోతోంది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని మథుర జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన కేసులో షబ్నమ్‌‌కు కోర్టు ఈ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే తన తల్లి ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ 12 ఏళ్ల మహ్మద్ తాజ్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు లేఖ రాశాడు. ఆమె చేసిన నేరాలను క్షమించాలని.. క్షమాభిక్ష పెట్టాలని కోరాడు. ఇక, తన తల్లిని క్షమించాని రాసి ఉన్న బోర్డును చేతిలో పట్టుకున్న తాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. జైలుకి వెళ్లి తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. "మా అమ్మంటే నాకు చాలా ఇష్టం.. ప్రెసిడెంట్ అంకుల్ నాకు ఒకే ఒక డిమాండ్ ఉంది.. అమ్మను ఉరితీయకుండా అడ్డుకోండి"అని కోరాడు.

    అసలు కేసు ఏమిటంటే..
    షబ్నమ్ అనే మహిళ ఇంగ్లిష్‌లో ఎంఏ పూర్తి చేసింది. ఐదో తరగతి కూడా పూర్తి చేయని సలీం అనే వ్యక్తిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ క్రమంలోనే 2008లో షబ్నమ్ ప్రియుడితో కలిసి తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపింది. అందులో ఆమె తల్లిదండ్రులు, సోదరులు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. దీంతో షబ్నమ్, సలీంలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే షబ్నమ్ గర్భవతిగా ఉంది. తరువాత.. షబ్నమ్‌ జైలులోనే తాజ్‌కు జన్మనిచ్చింది. ఇక, షబ్నమ్ తన కుమారుడికి సంరక్షణ బాధ్యతలను జర్నలిస్టు ఉస్మాన్‌ సైఫీకి తాజ్‌కు అప్పగించింది.

    ఈ కేసులో షబ్నమ్‌, సలీంలను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో వారు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. దీంతో 2016లో షబ్నమ్ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా.. దానిని ఆయన తిరస్కరించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు