Bombay High court: భారత శిక్షా స్మృతి (Indian Penal Code) ప్రకారం లైంగిక సంభోగం (Sexual Penetration) జరిగితేనే అత్యాచారం కిందకు వస్తుందని గతంలో న్యాయస్థానాలు కొన్ని తీర్పులు ఇచ్చాయి. తాజాగా బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సంభోగం (Penetration) జరగకపోయినా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద అత్యాచారం కిందకే వస్తుందని వెల్లడించింది. ఈ సెక్షన్ ప్రకారం ఓ కేసులో 33 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించింది.
2019లో జస్టిస్ రేవతి మోహితే డేరే ట్రయల్ కోర్టు సదరు వ్యక్తికి అత్యాచారం కింద 10 ఏళ్ల జైలు శిక్షను విధించడాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. మేధోపరమైన అత్యాచారంగా పరిగణించి శిక్ష విధించాలని బాధిత మహిళ.... సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. కోర్టు సదరు వ్యక్తిని దోషిగా తేల్చింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేస్తూ అతను చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. తనకు, బాధితురాలికి మధ్య సంభోగం జరగలేదని పిటిషన్ దారు తెలిపాడు.
అయితే ఫోరెన్సిక్ ఆధారాలు లైంగిగ వేధింపుల కేసుగా రుజువు చేశాయని హైకోర్టు గుర్తించింది. "బాధితురాలి బట్టలపై దొరిన మట్టి, సంఘటన జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన మట్టితో సరిపోలింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక ద్వారా కూడా ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సాక్ష్యం బాధితురాలి విశ్వసనీయతను తెలియజేస్తుంది. అప్పీలుదారు లైంగిక హింసకు పాల్పడ్డాడు" అని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. అయితే ఈ సంభోగం జరగలేదని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యమనీ... యోనిలో వేలు పెట్టడం కూడా చట్ట ప్రకారం నేరమేనని అభిప్రాయపడింది.
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం ఓ వ్యక్తి ఎవరైనా మహిళ ఇష్టానికి విరుద్ధంగా, ఆమె అనుమతి లేకుండా, చంపేస్తాననో లేదా హానిచేస్తామని భయపెట్టి సంభోగానికి ఒప్పిస్తే అత్యాచారంగా పరిగణిస్తారు. సెక్షన్ 376 ప్రకారం అత్యాచారం కేసుల్లో 10 ఏళ్ల నుంచి జీవితఖైదు వరకు శిక్ష విధించే అవకాశముంది.
2012లో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత అచ్యాచారం, లైంగిక హింస నిర్వచనం పరిధిని పెంచారు. 2013లో క్రిమన్ లా(సవరణ) చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. అత్యాచారం కేసులో బాధితురాలు చనిపోతే లేదా అచేతనావస్థకు చేరుకుంటే అందుకు గరిష్ఠంగా మరణ శిక్ష విధించే నిబంధన ఉంది. దీంతో పాటు ఈ చట్టంలో మహిళను వెంటాడటం, ఆమెను అదే పనిగా చూస్తుండటం కూడా నేరాల శ్రేణిలోకి చేర్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, News