Cyclone Vayu : దిశ మార్చుకున్న తుఫాను... గుజరాత్‌కి తప్పిన పెను ముప్పు...

Cyclone Vayu : వాయు తుఫాను దిశ మార్చుకోవడంతో... గుజరాత్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఐతే... అంతకంతకూ బలపడుతున్న తుఫాను ఇప్పుడు ఎటు వెళ్తుందన్నది తేలాల్సిన అంశం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 1:38 PM IST
Cyclone Vayu : దిశ మార్చుకున్న తుఫాను... గుజరాత్‌కి తప్పిన పెను ముప్పు...
సోమనాథ్ ఆలయం దగ్గర ఎగసి పడుతున్న అలలు
  • Share this:
గుజరాత్‌ వైపు వేగంగా దూసుకొచ్చిన వాయు తుఫాను కొద్దిగా రూట్ మార్చుకుంది. ప్రస్తుతం అది అరేబియా సముద్రంవైపు ఉత్తర, వాయవ్య దిశగా కదులుతోంది. అయినప్పటికీ బలమైన గాలులు మరో 24 గంటలు వీస్తాయన్న వాతావరణ అధికారులు... హై అలర్ట్ కొనసాగుతుందనీ, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ కోరారు. ఇప్పటివరకూ తీర ప్రాంతాల నుంచీ, డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతం నుంచీ 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 52 NDRF బృందాలు సహాయ చర్యల్లో తలమునకలై ఉన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. త్రివిధ దళాలు, తీర ప్రాంత రక్షణ దళం, బీఎస్ఎఫ్ జవాన్లు అందరూ తుఫాను సహాయ చర్యల్లో ఉన్నారు.

గుజరాత్‌ తీరం దాటని వాయు తుఫాను... వెరవల్, పోర్ బందర్, ద్వారకకు సమీపం నుంచీ వెళ్లిపోతుందని అంచనా వేశారు. దాని ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాత్రంతా వాయు తుఫాను ఉత్తర, వాయవ్య దిశవైపు కదులుతూ వచ్చింది. ప్రస్తుతం అది గుజరాత్ తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది తన రూట్‌లో ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో గంటకు 135 నుంచీ 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

తీర ప్రాంతంలో... యుద్ధ నౌకలు, విమానాల్ని సిద్ధం చేశారు. పోర్‌బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను నేటి అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నారు. అక్కడ స్కూళ్లకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. 70 రైళ్లు రద్దుచేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతోంది.

 



ఇవి కూడా చదవండి :

పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే

ఎంతకీ బరువు తగ్గలేకపోతున్నారా?... రోజూ ఇది తాగండి... తేడా కనిపిస్తుంది... ప్రకృతి వరంఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...

రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...
First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>