విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మంది..

నేపాల్‌లో అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 44 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నేపాల్ అధికార యంత్రాగం అంచనా వేసింది.

news18-telugu
Updated: July 11, 2020, 9:22 AM IST
విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మంది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నేపాల్‌ను వరదలు ముంచేత్తుతున్నాయి. వరద ఉధృతి ఎక్కువ కావడంతో నదుల వెంట ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. నేపాల్‌లోని కస్కీ జిల్లాలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 12మంది చనిపోగా, మరో 19 మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. దీంతో పదుల సంఖ్యలో ఇళ్లన్నీ కూలిపోయాయి. నేపాల్‌లో అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 44 మంది గల్లంతయ్యారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నేపాల్ అధికార యంత్రాగం అంచనా వేసింది.

ఇప్పటికే కూలిపోయిన ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ప్రధానంగా పొఖారా పట్టణానికి సమీపంలోని సారంగ్‌కోట్, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా కొండచరియలు విరిగిపడ్డాయి. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడడంతో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రకటించారు.
Published by: Narsimha Badhini
First published: July 11, 2020, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading