ఛత్తీస్గఢ్(Chhattisgarh) ఘోర ప్రమాదం జరిగింది. బస్తర్ జిల్లాలో జగదల్పూర్లోని మల్గావ్లో సున్నపు రాయి గని కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మృతులంతా కూలీలు. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. స్పాట్లోనే ఐదుగురు మరణించగా.. ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఇంకా చాలా మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎంత మంది ఉన్నారన్న విషయం స్పష్టంగా తెలియదు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి.. అక్కడ చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Delhi HC: ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏం చేయాలి ?.. ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు..
जगदलपुर के मालगांव में एक खदान में हादसे के दौरान 6 श्रमिकों की दुखद मृत्यु का समाचार मिला है। ईश्वर दिवंगत श्रमिकों की आत्मा को शांति एवं उनके परिवारों को हिम्मत दे। साथ ही घायलों के शीघ्र स्वास्थ्य लाभ की कामना करता हूँ। अन्य फंसे हुए लोग सुरक्षित निकलें, ऐसी प्रार्थना है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) December 2, 2022
సున్నపురాయి గనిలో ప్రమాదంపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. మల్గావ్లోని గనిలో జరిగిన ప్రమాదంలో 6 మంది కార్మికులు విషాదకరమైన మరణానికి సంబంధించిన వార్త విని.. దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. చనిపోయిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని... గనిలో చిక్కుకున్న ఇతర వ్యక్తులు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు.
గుజరాత్ లో కలకలం..ఎన్నికలు జరుగుతున్న వేళ రూ.478 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
స్థానికులు ఇక్కడి గని నుంచి ఒక రకమైన ఇసుకను బయటకు తీస్తారు. ఇది సాధారణ ఇసుకలా ఉండదు. సున్నం రూపం. గ్రామస్తులు తమ ఇళ్లకు రంగులు వేయడానికి ఉపయోగిస్తారు. తరచుగా గ్రామస్తులు గనిలోకి దానిని తవ్వితీస్తారు. ఐతే ఇవి బలహీనంగా ఉండడం వల్ల.. అప్పుడప్పుడూ గని పైకప్పు కూలిపడుతుంటుంది. ఇవాళ జరిగిన ప్రమాదం కూడా అలాంటిదే. గ్రామస్తులు గనిలోపలికి వెళ్లి.. సున్నపు రాయిని తవ్వుతున్న సమయంలో.. ఒక్కసారిగా పైకప్పు కూలి.. వారంతా అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకోవడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, National News