హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Road Accident: గుజరాత్ లో ఘోర ప్రమాదం..అక్కడిక్కడే ఏడుగురు దుర్మరణం

Road Accident: గుజరాత్ లో ఘోర ప్రమాదం..అక్కడిక్కడే ఏడుగురు దుర్మరణం

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, తాగి బండి నడపడం, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Gujarat, India

  దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, తాగి బండి నడపడం, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదం అంటే ఓ బండి రోడ్డు మీద పడడం కాదు. ఓ కుటుంబమే రోడ్డు మీద పడడం. ఇక తాజాగా గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వడోదరలోని దర్జీపురాలో ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

  ఓ చిన్న నిర్లక్ష్యం ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏ మాత్రం ఏమరుపాటు చేసిన కుటుంబాలు రోడ్డున పడుతాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలి. దానివల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. అలాగే కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాద తీవ్రత నుండి బయటపడొచ్చు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Road accident

  ఉత్తమ కథలు