హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fire Accident: రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయి ఏడుగురు సజీవ దహనం

Fire Accident: రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోయి ఏడుగురు సజీవ దహనం

అగ్నిప్రమాదం జరిగిన భవనం ఇదే

అగ్నిప్రమాదం జరిగిన భవనం ఇదే

Indore Fire Accident: మృతుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇంటి సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం (Madhya Pradesh Fire Accident) జరిగింది. ఇండోర్ నగరంలోని ఓ రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు (Indore Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం తెల్లవారుఝామున మూడున్నర గంటల సమయంలో ఇండోర్ విజయనగర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్వర్ణ్ బాగ్ కాలనీలో ఉన్న ఓ రెండస్తుల భవనంలో మంటలు ఎగిసిపడతున్నట్లు శనివారం ఉదయం 4 గంటల సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. ఐతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో తొమ్మిది మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలతో కాపాడారు.

LPG cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్.. ఎల్పీజీ ధరల మోత.. డొమెస్టిక్ సిలిండర్ రేటు

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇంటి సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న వాహనాలన్నీ కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. మంటలు పూర్తిగా ఆగిపోయిన అగ్నిమాపక సిబ్బంది ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. పలు గదుల్లో ఫర్నిచర్, గృహోపకరణాలు పూర్తిపోయాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బిర్యానీలో కలిపి నగలు మింగేశాడు! -ఈద్ పార్టీ కోసం ఇంటికి పిలిస్తే ఇదీ మేనేజర్ నిర్వాకం

ఇండోర్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించానని..నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు శివరాజ్ సింగ్ చౌహాన్.

First published:

Tags: Fire Accident, Madhya pradesh

ఉత్తమ కథలు