హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Fire Accident: అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన గుడిసెలు.. ఏడుగురి సజీవ దహనం

Delhi Fire Accident: అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన గుడిసెలు.. ఏడుగురి సజీవ దహనం

Delhi Fire Accident:  అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించడంతో.. తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు చనిపోయి ఉంటారని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు

    దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం (Delhi Fire Accident) జరిగింది. గోకల్‌పురి ప్రాంతంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో కాలిపోయి దుర్మరణం చెందారు. గోకల్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే పెద్ద ఎత్తున గుడిసెలు తగులబడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. తెల్లవారుఝామున 4 గంటల సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఐతే అప్పటికే 60 గుడిసెలు తగులబడ్డాయి. పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఒక్కో గుడిసెను తనిఖీ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో శవాలు బయటపడ్డాయి. మొత్తం ఏడుగురి శవాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు ఈ శాన్య ఢిల్లీ డీసీపీ  పేర్కొన్నారు.  అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు వ్యాపించడంతో.. తప్పించుకోలేని పరిస్థితుల్లో వారు చనిపోయి ఉంటారని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా కాలిపోయాయని వెల్లడించారు.

    ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదశాత్తు జరిగిందా? లేదంటే ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలను ఇవాళ సీఎం కేజ్రీవాల్ పరామర్శించనున్నారు. ఆ సమయంలో వారికి ఎక్స్‌గ్రేషియా అందజేసే అవకాశముంది.

    First published:

    ఉత్తమ కథలు