పూజలు చేసి నిమజ్జనానికి వెళ్లారు.. అంతలోనే విషాదం.. చెరువులో మునిగి ఏడుగురు అమ్మాయిలు మృతి

ప్రతీకాత్మక చిత్రం

Jharkhand: చెట్టు కొమ్మను నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు అమ్మాయిలు నీట మునిగిపోయారు. వారిని రక్షించేందుకు మిగతా అమ్మాయిలు ప్రయత్నించారు. ఇలా ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రయత్నిస్తూ.. అందరూ నీటిలో మునిగిపోయారు.

 • Share this:
  పండగ పూట ఝార్ఖండ్‌ (Jharkhand)లో విషాదం నెలకొంది. చెరువులో మునిగిపోయి ఏడుగురు అమ్మాయిలు మరణించారు. లాతేహార్ జిల్లాలోని బాలుమత్ మండలం బుక్రు గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌లో గిరిజనుల ప్రధాన పండగ కర్మ పూజ (Karma Puja). కర్మ పండగ వేళ మహిళలంతా ప్రకృతిని పూజిస్తారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అందరూ భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. బుక్రు గ్రామానికి 10 మంది అమ్మాయిలు కూడా అందరిలానే కర్మ పూజ చేశారు. ఆ తర్వాత పూజలు చేసిన చెట్టు కొమ్మను నిమజ్జనం చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. ఐతే చెట్టు కొమ్మను నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు అమ్మాయిలు నీట మునిగిపోయారు. వారిని రక్షించేందుకు మిగతా అమ్మాయిలు ప్రయత్నించారు. ఇలా ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రయత్నిస్తూ.. అందరూ నీటిలో మునిగిపోయారు. వారి కేకలు విని స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

  ఐతే అప్పటికే నీటిలో మునిగిన నలుగురు మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. ముగ్గురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు రేఖా కుమారి (18), రీనా కుమారి (16), లక్ష్మీ కుమారి (12) ఉన్నారు. మిగిలిన వారిని సుష్మా కుమారి (12), పింకు కుమారి (18), సునిత కుమారి (20), బసంతి కుమారి (12) ఉన్నారు. వీరంతా 12 నుంచి 20 ఏళ్ల లోపు వారు. స్థానికంగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఒకే ఊరిలో ఏడుగురు అమ్మాయిలు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

  నా భార్యకు పుట్టిన బిడ్డకు నేను తండ్రిని కాదు..హైకోర్టును ఆశ్రయించిన భర్త.. షాకింగ్ ఆరోపణలు

  కర్మపూజ వేళ జరిగిన ఈ విషాద ఘటనపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  GreenHeros: ఈ అన్నదమ్ములు భేష్.. 48 గంటల్లో ఎన్నివేల మొక్కలు నాటారంటే..

  మరోవైపు ఈ ఘటనపై గ్రామస్థుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని స్థానిక అధికారులను డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ ఆదేశించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: