Home /News /national /

SEVEN DEAD AND THREE INJURED IN A FIRE AT A FIRECRACKERS FACTORY IN CUDDALORE TAMIL NADU SK

ఘోర ప్రమాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి..

 బాణసంచా ఫ్యాక్టరీకి అనుమతులు లేవని.. చట్ట విరుద్ధంగా నడుస్తుందని పోలీసులు గుర్తించారు. టపాసుల పేరుతో నాటుబాంబులు కూడా తయారు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

    తమిళనాడులో ఘోరప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అందులో పనిచేసే ఏడుగురు మహిళలు మరణించగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కడలూరు జిల్లా కట్టుమన్నార్ కోయిల్ తాలుకా కూరుంకుడి గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఫ్యాక్టరీ యజమాని, ఆమె కూతురు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బాణసంచా ఫ్యాక్టరీలో 15 మంది మహిళలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

    పేలుడు ధాటికి ఆ శబ్ధాలు కిలో మీటర్ల వరకు వినిపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నందను.. బాణాసంచా షెడ్డు పక్కనే ఉన్న ఇల్లు కూడా కుప్పకూలింది. ఐతే ఆ బాణసంచా ఫ్యాక్టరీకి అనుమతులు లేవని.. చట్ట విరుద్ధంగా నడుస్తుందని పోలీసులు గుర్తించారు. టపాసుల పేరుతో నాటుబాంబులు కూడా తయారు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Fire Accident, Fire crackers, Tamilandu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు