ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ వేటు...

పార్లమెంట్ (File)

కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియకోస్, ఆర్ ఉన్నితన్, మాణిక్యం ఠాగూర్, బెన్నీ బెహ్నన్, గుర్జీత్ సింగ్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు.

  • Share this:
    కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీల మీద లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు వారిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎన్ ప్రతాపన్, డీన్ కురియకోస్, ఆర్ ఉన్నితన్, మాణిక్యం ఠాగూర్, బెన్నీ బెహ్నన్, గుర్జీత్ సింగ్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ వారిపై వేటు వేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్ల మీద సభలో చర్చించాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు భారీ ఎత్తున సభలో నినాదాలు చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. ఢిల్లీ అల్లర్ల మీద తక్షణం స్పందించాలంటూ వరుసగా మూడో రోజు కూడా సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటలక ప్రారంభమైన సభ ఓ సారి వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత మరోసారి కూడా సభలో అదే సీన్ రిపీట్ కావడంతో లోక్‌సభను మార్చి 6వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: