Home /News /national /

SEVEN CIVILIANS SUSTAIN MINOR INJURIES AS TERRORISTS HURL GRENADE AT CRPF IN PULWAMA JAMMU AND KASHMIR SK

Pulwama Terror Attack: పుల్వామాలో బాంబు దాడి.. మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బస్టాండ్ సమీపంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరిపారిపోయారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఎవరికీ ఏమీ కాలేదు. ఎనిమిది పౌరులు మాత్రం గాయపడ్డారు.

    జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా ట్రాల్‌లో సీఆర్‌పీఎఫ్ ( CRPF) బలగాలే లక్ష్యంగా బాంబు దాడి చేశారు. బస్టాండ్ సమీపంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరిపారిపోయారు.  ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఎవరికీ ఏమీ కాలేదు. ఎనిమిది పౌరులు మాత్రం గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు విసిరిన బాంబుల తక్కువ తీవ్రత ఉన్నవి అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ట్రాల్ పట్టణాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేస్తున్నారు.



    ఇటీవల ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మే 26న ఇదే ట్రాల్ పట్టణంలో సీఆర్‌పీఎఫ్ బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్లు విసిరారు. ఆ ఘటనలో ఎవరికీ ఏం జరగలేదు. అంతకు ముందు మే 12న సాంబా జిల్లాలో పోలీసుల బృందంపై దాడి చేశారు. సాంబా-ఉదంపూర్ రోడ్డుపై సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో వారిపై బాంబులు విసిరారు.


    కాగా, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. రోడ్డుమార్గంలో వెళ్లున్న జవాన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడిచేశాడు. 100 కేజీల పేలుడు పదార్థాలు ఉన్న కారుతో జవాన్ల బస్సును ఢీకొట్టాడు. ఆ దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jammu and Kashmir, Pulwama Terror Attack, Terror attack

    తదుపరి వార్తలు