Modi B'Day : నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు... వెల్లువెత్తుతున్న విషెస్...

Narendra Modi Birth Day : రెండోసారి ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మరింత స్పష్టమైన నిర్ణయాలతో... ఆర్థిక వ్యవస్థను రూ.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 8:07 AM IST
Modi B'Day : నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు... వెల్లువెత్తుతున్న విషెస్...
నరేంద్ర మోదీ (Souce - Twitter - ROFL MÓDí)
Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 8:07 AM IST
PM Narendra Modi Birth Day : గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించిన నరేంద్ర మోదీ... ప్రధాన మంత్రిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. రెండోసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టాక ఆయన మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ... అందులో భాగంగా జమ్మూకాశ్మీర్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అలాగే... విదేశాల నుంచీ భారత్‌కు మద్దతు పెరిగేందుకు... అంతర్జాతీయ స్థాయిలో సత్సంబంధాల్ని పెంచుతున్నారు. అటు పార్టీనీ, ఇటు దేశాన్నీ ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కోట్ల మంది ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్‌లో మోదీ పుట్టిన రోజుకు సంబంధించి మూడు ట్రెండింగ్స్ నడుస్తుండటాన్ని బట్టీ ఆయన పట్ల ప్రజల్లో అభిమానం ఉందో చెప్పొచ్చు.
ఐతే... ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటం మోదీ సర్కార్‌కి సవాల్ విసురుతోంది. దీనికి కారణాలు ఏవైనా సరే... ఈ సమస్య నుంచీ కేంద్రం ఎలా బయటపడేస్తుందన్నది మోదీ ముందున్న అవరోధంగా మారింది. బ్యాంకుల విలీనం, పన్ను రాయితీలు వంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా... పారిశ్రామిక ఉత్పత్తి రంగం, ఆటోమొబైల్ రంగం పడిపోతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు తొలి త్రైమాసికంలో 5 శాతానికే పరిమితమైంది. అంచనాల కంటే అది 2 శాతం పడిపోవడం ఆర్థిక వేత్తలనే ఆశ్చర్యపరిచింది.


మరోవైపు పాకిస్థాన్ లాంటి దేశాలు యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. ఉగ్రవాదుల్ని రెచ్చగొడుతున్నాయి. అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నా్యి. ఇది జమ్మూకాశ్మీర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో సవాల్. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో 40 రోజులకు పైగా ఆంక్షలు కొనసాగుతున్నా... ప్రశాంత పరిస్థితులు లేవు. కేంద్రం మాత్రం అంతా సవ్యంగా ఉందని చెబుతోంది.


సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా మరో పెద్ద సవాల్ కానుంది. ఎందుకంటే... మన దేశంలో ఈ రోజుల్లో ప్రతీ వస్తువు వాడకంలో ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరిగా ఉంటోంది. ముఖ్యంగా వాటర్ బాటిళ్లు, స్ట్రాలు, టీ కప్పులు, స్నాక్స్ వంటి వాటిలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా ఉంటోంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు ప్రజలు సింగిల్ యూజ్ క్యారీబ్యాగ్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు. ఈ అలవాటు నుంచీ ప్రజలను బయటపడెయ్యడం అంత తేలిక కాదు.


మోదీ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ... సేవా సప్త (Service week) నిర్వహిస్తోంది. శనివారం నుంచీ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు... సేవా సప్తలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా... ఢిల్లీ ఎయిమ్స్‌లో ఫ్లోర్‌ని చీపురుతో తుడిచి శుభ్రం చేశారు. పార్టీ నేతలు ఢిల్లీ హాస్పిటల్‌లో షేషెంట్లు, చిన్నారుల్ని కలిసి పరామర్శించారు.


సెప్టెంబర్ 20 వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. శుభ్రతను పాటించడమే దీని ఉద్దేశం. నీటిని పొదుపు చెయ్యడం కూడా ఇందులో ఓ భాగం. మోదీ జన్మదినం సందర్భంగా... ఆయన ఇప్పటివరకూ చేసిన సామాజిక కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా వివిధ ఎగ్జిబిషన్లలో బీజేపీ ఇవాళ ప్రదర్శిస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం కూడా సేవా సప్తలో కీలక అంశంగా కొనసాగుతోంది.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...