HOME »NEWS »NATIONAL »setback to bihar cm nitish kumar as six jdu mlas join bjp in arunachal pradesh ba

బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు షాక్, ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్

బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు షాక్, ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్
నితీష్ కుమార్, బీహార్ సీఎం (ఫైల్ ఫోటో)

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు షాక్ తగిలింది. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే, ఇది బీహార్‌లోకాదు. అరుణాచల్ ప్రదేశ్‌లో.

  • Share this:
    బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు షాక్ తగిలింది. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే, ఇది బీహార్‌లోకాదు. అరుణాచల్ ప్రదేశ్‌లో. ఆ రాష్ట్రంలో జేడీయూ తరఫున ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేరారు. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. జేడీయూ ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ఓ వైపు బీహార్‌లో రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి తరఫున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సమయంలో జేడీయూకే చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలతో పాటు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు.

    ఇవి కూడా చదవండి



    యూకేలో వచ్చిన కొత్త కరోనా వైరస్ లక్షణాలు

    తక్కువ ధరకే సొంతిల్లు కొనుక్కోవడం ఎలా? 3 చిట్కాలు

    అరుణాచల్ ప్రదేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు ఇలా ఎమ్మెల్యేలు జంప్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జేడీయూ ఎమ్మెల్యేలు తాలెం తబూ, హయాంగ్ మంగ్ఫీ, జక్కీ టాకో, దోర్జీ ఖర్మ, డోండ్రు సియోంజు, కంగాంగ్ టాకు బీజేపీలో చేరారు. సియోంజు, ఖర్మ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ షోకాజ్ నోటీసు ఇచ్చింది. వారిద్దరూ పార్టీ మారతారని అనుమానం వ్యక్తం చేసింది. అయితే, ఆరుగురు పార్టీ మారడం విశేషం. ఈ నెల ఆరంభంలో, పీపీఏ ఎమ్మెల్యేను కూడా ఆ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరారు.

    ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

    TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు 

    బీజేపీలో చేరడానికి ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను ఆమోదిస్తున్నట్టు అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు బీఆర్ వాఘే తెలిపారు. 2019లో 15 సీట్లకు ఎన్నికలు జరగ్గా అందులో 7 సీట్లు గెలుచుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 7 సీట్లు దక్కించుకుంది. ఇప్పుడు ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు, మరో పీపీఏ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడంతో బీజేపీ సంఖ్యా బలం 48కి చేరింది.

    విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

    ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

    ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలసి పోటీ చేశాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో.. ఎన్డీయే 125 సీట్లు సాధించింది. మహాకూటమి 110 సీట్లు దక్కించుకుంది. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకే పరిమితయింది. ఇక CPIMLL 11, MIM 5, HAMS 4, VIP 4, CPM 3, CPI 2, LJP ఒక స్థానంలో గెలిచాయి. మ్యాజిక్ మార్క్ 122 కంటే మూడు సీట్లు ఎక్కువ గెలవడంతో.. ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నేతలు తార్ కిశోర్ ప్రసాద్, రేణు దేవి డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:December 25, 2020, 17:56 IST