రాజస్థాన్‌లో ఆపరేషన్ ఆకర్ష్...6 గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్...

కాంగ్రెస్ విశ్వసనీయత లేని పార్టీ అని ఆమె అన్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పోరాడాల్సింది పోయి, కాంగ్రెస్ తనకు మద్దతునిచ్చే పార్టీలకు నష్టం చేకూరుస్తోందని ఆమె విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ఇకపై దళితులు, ఎస్‌టిలు, ఓబిసిలకు పూర్తి వ్యతిరేకంగా మారిందని ఆమె విమర్శించారు.

Krishna Adithya | news18-telugu
Updated: September 17, 2019, 5:38 PM IST
రాజస్థాన్‌లో ఆపరేషన్ ఆకర్ష్...6 గురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్...
బీఎస్పీ అధినేత్రి మాయావతి (File)
  • Share this:
రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు బిఎస్‌పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం పై బిఎస్‌పి అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ, సీఎం గెహ్లాట్ అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారని దుయ్యబట్టారు. అంతే కాదు బిఎస్‌పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం నమ్మక ద్రోహమని, ప్రజా తీర్పును అపహాస్యం చేయడమేనని ఆమె అన్నారు. అలాగే కాంగ్రెస్ విశ్వసనీయత లేని పార్టీ అని ఆమె అన్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పోరాడాల్సింది పోయి, కాంగ్రెస్ తనకు మద్దతునిచ్చే పార్టీలకు నష్టం చేకూరుస్తోందని ఆమె విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ఇకపై దళితులు, ఎస్‌టిలు, ఓబిసిలకు పూర్తి వ్యతిరేకంగా మారిందని ఆమె విమర్శించారు.

అలాగే దళితులు, మైనారిటీలు, ఓబీసీల హక్కుల కోసం పాటుపడుతున్న తమ లాంటి పార్టీని తూట్లు పొడవడం ద్వారా వారి కుటిల నీతి బయటపడిందని ఆమె దుయ్యబట్టారు. అలాగే అంబేద్కర్ సిద్ధాంతాలకు సైతం కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకమని ఆమె అన్నారు. కాంగ్రెస్ చేసిన నమ్మక ద్రోహం ఫలితంగానే అంబేద్కర్ తొలి న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు.
Published by: Krishna Adithya
First published: September 17, 2019, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading