Home /News /national /

SET FIRE TO GRANDMA WITH ALIVE BY HIS GRANDSON IN TAMILNADU VRY

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు.. కారణం వింటే షాకే మరి..

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు..

Tragedy : అమ్మమ్మ, రెండు కుక్క పిల్లలను కలిపి సజీవ దహనం..చేసిన మనవడు..

Tragedy : మద్యం మత్తులో ఓ వ్యక్తి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. మంచాన పడిన తన అమ్మమ్మతో పాటు ఇంట్లో రెండు కుక్కపిల్లలను కూడా పాత సామానులో కలిపి సజీవ దహనం చేశాడు. పోలీసులు అడిగితే విచిత్రమైన సమాధానం చెప్పాడు...

  మద్యం మత్తులో చాలా మంది విచక్షణ కోల్పోవడం సహజమే .. మరికొంతమంది అయితే ఎక్ట్సీమ్‌గా ప్రవర్తిస్తారు. తాము ఏం చేస్తున్నామో తెలియకుండా జుగుప్సకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాగిన మైకంలో తల్లి, చెల్లి, ఇంకా ఎవరైనా డోంట్‌కేర్ అనే ధోరణి అనేక దారుణాలకు పాల్పడ్డ సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి..

  అయితే తాజాగా ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే సంఘటన చోటు చేసుకుంది. కింద కాలుతీసి పెట్టలేని తన అమ్మమ్మను .. కన్నతల్లి లేకున్నా ...సంవత్సరాల తరబడి కష్టపడి పోషించిన అమ్మమ్మ అని కూడా చూడకుండా కేవలం నాలుగు రోజుల పాటు తిండి పెట్టలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆమెను సజీవదహనం చేసిన ఘటన తమిళనాడులోని (Tamilnadu ) తంజావూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

  ఇది చదవండి :   తల్లిపై ప్రేమను అతడు ఇలా చాటుకున్నాడు.. వివరాల్లోకి వెళ్తే..

  స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పేరావూరణి యూనియన్‌ సెంగమంగలం గ్రామానికి చెందిన అజిత్‌ (32) కార్మికుడు. పుట్టిన కొన్ని నెలల్లోనే తండ్రి పళనివేల్‌ కుటుంబాన్ని వదిలేశాడు. పుట్టింటికి వచ్చిన తల్లి ధనలక్ష్మి 15 ఏళ్ల క్రితం మరణించింది. అమ్మమ్మ సెల్లమ్మాళ్‌ (92) కొబ్బరి తోపులో కూలీ పనులకు వెళ్లి అజిత్‌ను పోషించింది. అయితే.. వృద్యాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులుగా సెల్లమ్మాళ్‌ మంచాన పడింది. దీంతో 4 రోజులుగా వండిపెట్టేవారు లేకపోవడంతో మనవడు అజిత్‌ విచక్షణ కోల్పోయాడు.

  ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కిరాతకానికి పాల్పడ్డాడు. పిచ్చోడుగా మారి ఇంట్లోని పాత సామాన్లను బయట ఒక కుప్పేసి వాటితో పాటు అమ్మమ్మను కూడా తగలబెట్టాడు. అంతటితో ఆ కిరాతకుడు ఆగలేదు. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క, ( dogs ) దాని పిల్లలను కూడా చంపి.. అదే మంటల్లో వేశాడు. అయితే ఇంతా జరుగుతున్నా పట్టించుకునే కరువయ్యారు.. కారణం పక్కనే ఇళ్లు లేకపోవడంతో ఈ కిరాతకం వెంటనే ఎవరికీ తెలియలేదు.

  ఇది చదవండి : ఎక‌రాకు రూ.30వేల పెట్టుబ‌డితో.. రూ.1.30 లక్షల ఆదాయం.. సీతాఫ‌ల సాగులో రాణిస్తున్న పెద్ద‌ప‌ల్లి జిల్లా రైతు


  దీంతో సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిన్న ఉదయం కాలిన శవం వాసన రావడంతో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని చూసి పోలీసులకు ( police ) సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న స్థానిక డీఎస్పీ సెంగమల కన్నన్‌, పేరావూరణి పోలీసులు అక్కడికి చేరుకుని అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడు.

  పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎందుకు చేశావని ప్రశ్నిస్తే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు.. గత 4 రోజులుగా అమ్మమ్మ వంట చేయకపోవడంతో తిండిలేక తట్టుకోలేకపోయానని..అందుకే ఇంట్లో ఉన్న పచ్చి బియ్యం తిన్నానని, ఆ కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డానని నిందితుడు తెలిపాడు. నిందితుడి సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కాగా చిన్నతనంలోనే అజిత్‌ మద్యానికి అలవాటు పడ్డాడని, అతనికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime story, Tamilnadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు