• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SERUM INSTITUTE OF INDIA CEO POONAWALLA SAYS HIS COMPANY HAS APPLIED TO START TRIALS OF ANOTHER COVID19 VACCINE SSR

భారతీయులకు గుడ్‌న్యూస్.. మరో వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. స్ట్రెయిన్‌పై కూడా..

భారతీయులకు గుడ్‌న్యూస్.. మరో వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. స్ట్రెయిన్‌పై కూడా..

ప్రతీకాత్మక చిత్రం

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే కోవిషీల్డ్‌ను అందుబాటులోకి తెచ్చిన సీరమ్ భారత్‌లో మరో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం నాడు పూనావాలా ప్రకటించారు. నోవావ్యాక్స్ అనే అమెరికన్ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా...

  • Share this:
    పుణె: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే కోవిషీల్డ్‌ను అందుబాటులోకి తెచ్చిన సీరమ్ భారత్‌లో మరో వ్యాక్సిన్ ట్రయల్స్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం నాడు పూనావాలా ప్రకటించారు. నోవావ్యాక్స్ అనే అమెరికన్ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా కోవిడ్-19కు వ్యాక్సిన్‌గా ‘కోవావ్యాక్స్’ను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 2021 నాటికి కోవావ్యాక్స్ భారతీయులకు అందించే అవకాశం ఉంటుందని సీరమ్ సీఈవో పేర్కొన్నారు. యూకేలో నోవావ్యాక్స్‌ వ్యాక్సిన్ సత్ఫలితాలనివ్వడంతో పూనావాలా ఈ వ్యాక్సిన్‌నూ భారతీయులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నారు. యూకేలో నిర్వహించిన ట్రయల్స్‌లో 89.3 శాతం ప్రభావవంతంగా నోవావ్యాక్స్‌ వ్యాక్సిన్‌ పనిచేసినట్లు తేలింది.

    అంతేకాదు, యూకేలో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్‌పై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసినట్లు ప్రాథమిక అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో నోవావ్యాక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, జూన్ 2021 నాటికి ఈ టీకా భారత్‌లో అందించనున్నట్లు అదర్ పూనావాలా ట్వీట్ ద్వారా ప్రకటించారు. నోవావ్యాక్స్‌కు మొత్తం ఆరు చోట్ల వ్యాక్సిన్ తయారీ పరిశ్రమలున్నాయి. మొత్తం ఏడు దేశాల్లో 8 ప్లాంట్లలో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించి సంవత్సరానికి 2 బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను అందించడమే లక్ష్యంగా నోవావ్యాక్స్ ముందుకెళుతోంది.

    అమెరికా ప్రభుత్వం జూలైలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని నోవావ్యాక్స్‌కు 1.6బిలియన్ డాలర్లను కూడా విడుదల చేసింది. నోవావ్యాక్స్ వ్యాక్సిన్ కోసం యూరోపియన్ యూనియన్, ఫిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నాయి. యూకేలో మొత్తం 15,000 మందిపై నోవావ్యాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగాయి. వీరంతా 18 నుంచి 84 సంవత్సరాల వయసు కలిగిన వారు కావడం గమనార్హం. వీరిపై నోవావ్యాక్స్ 89.3 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు దరఖాస్తు చేసుకున్న సీరమ్ ఇప్పటికే కోవిషీల్డ్‌ను దేశ ప్రజలకు అందించింది. ఈ ఉపద్రవం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 40 మిలియన్ డోస్‌ల కోవిషీల్డ్‌ను సీరమ్ ఉత్పత్తి చేసింది. ఇటీవల భారత్‌లో మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ కాగా, మరొకటి కోవిషీల్డ్ కావడం గమనార్హం. కోవిషీల్డ్ వల్ల భారత్‌లో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడంతో ఇతర దేశాలకు కూడా సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసింది. బహ్రెయిన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులకు కూడా కోవిషీల్డ్‌ను భారత్ ఎగుమతి చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published: