• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SERUM INSTITUTE LOST RS 1000 CRORES IN FIRE ACCIDENT IN PUNE SK

Serum Fire Accident: రూ.వెయ్యి కోట్ల నష్టం.. ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై ప్రభావం

Serum Fire Accident: రూ.వెయ్యి కోట్ల నష్టం.. ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై ప్రభావం

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం (Image: ANI)

అగ్నిప్రమాదంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు భారీగా నష్టం వాటిల్లింది. ఏకంగా రూ.1000 కోట్లపైనే నష్టం వాటిల్లినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావల్లా తెలిపారు

  • Share this:
    కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ (Covishield)ను తయారుచేసే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (SII)లో అగ్నిప్రమాదం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుణె మంజరి ప్రాంగణంలోని SII కొత్త ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు భారీగా నష్టం వాటిల్లింది. ఏకంగా రూ.1000 కోట్లపైనే నష్టం వాటిల్లినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావల్లా తెలిపారు. శుక్రవారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం వివరాల గురించి అదర్ పూనావాలను అడిగి తెలుసుకున్నారు.

    '' అగ్నిప్రమాదం వలన కరోనా వ్యాక్సిన్ల తయారీపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇప్పుడున్న స్టాక్‌‌కు కూడా నష్టం జరగలేదు. ప్రమాదం జరిగింది కోవిషీల్డ్ తయారుచేస్తున్న చోట కాదు. అండర్ ఇన్‌స్టాలేషన్ బిల్డింగ్‌లో ప్రమాదం సంభవించింది. టీకాల తయారీకి అక్కడ ఉంచిన పరికరాలు, ఇతర ప్రొడక్ట్‌లు దెబ్బతిన్నాయి. రోటా, బీసీజీ టీకాలకు సంబంధించి భారీగా నష్టం జరిగింది. వెయ్యి కోట్లకు పైగా నష్టం జరిగింది. రోటా, బీసీజీ టీకాల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముంది.'' అని అదర్ పూనావాలా తెలిపారు.

    మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ... ''కరోనా టీకా యావత్ ప్రపంచానికి ఆశాకిరణం. సీరంలో అగ్నిప్రమాద ఘటన గురించి విని షాక్‌కు గురయ్యాం. నేను సీరమ్‌ను సందర్శించాను. వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు ఎలాంటి నష్టం జరగలేదని భరోసా ఇస్తున్నా. అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఘటనకు కారణాలేంటనేది దర్యాప్తు జరిగిన తర్వాతే తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు.


    ప్రస్తుతం మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్ (Covishield), భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కొవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్‌లను వినియోగిస్తున్నారు. ఈ రెండు వాక్సిన్‌లను డీసీజీఐ (DCGI) ఆమోద ముద్రవేయడంతో.. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ఇది ప్రపంచలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్. అన్ని రాష్ట్రాల్లో తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొసాగుతోంది
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు