Home /News /national /

SERUM INSTITUTE CEO ADAR POONAWALLA COMMENTS ON FOURTH WAVE OF COVID19 PVN

Adar Poonawalla: భారత్ లో ఫోర్త్ వేవ్ పై పూనావాలా కీలక వ్యాఖ్యలు

అదర్ పూనావాలా

అదర్ పూనావాలా

Covid Fourth Wave : అమెరికా, యూరప్‌ దేశాల్లో చూస్తే భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయనీ.. సరైన వ్యాక్సిన్లను ఎంచుకోవడం వల్లే మన వద్ద తక్కువ కేసులు వస్తున్నాయని పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో దేశంలో కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ సంస్థ తయారుచేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కొన్నాళ్లు శాంతించిన మహమ్మారి, మళ్లీ కోరలు చాస్తోంది. చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అయితే భారత్ లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ...యూకే, అమెరికా, చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. సీరమ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(SII)సీఈవో అదర్‌ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పుణెలో విలేకర్లతో మాట్లాడిన పూనావాలా...భారత్‌ సరైన వ్యాక్సిన్ ను ఎంచుకోవడం వల్లే ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తక్కువగా వస్తున్నాయన్నారు. దేశంలో అర్హులైన వారందరికీ రెండు డోసులూ పంపిణీ చేయడంలో కేంద్రం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. ఇతర దేశాల్లో కన్నా మన వ్యాక్సిన్లే మెరుగని నిరూపితమయ్యాయన్నారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో చూస్తే భారీ సంఖ్యలో కేసులు వస్తున్నాయనీ.. సరైన వ్యాక్సిన్లను ఎంచుకోవడం వల్లే మన వద్ద తక్కువ కేసులు వస్తున్నాయని పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో దేశంలో కొవిషీల్డ్‌ టీకాను సీరమ్‌ సంస్థ తయారుచేసిన విషయం తెలిసిందే.

ఒకవేళ మన దేశంలో కొవిడ్‌ నాలుగో దశ వచ్చినా తేలికపాటి ప్రభావమే ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత రూపంలో ఉన్న టీకాలు కొత్త వేరియంట్లపై పనిచేస్తాయా అన్న ప్రశ్నకు.... బూస్టర్‌ డోసు తీసుకుంటే భవిష్యత్తు వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అనేక ఇతర దేశాలు తమ పౌరులకు బూస్టర్‌ డోసు అందిస్తున్నాయన్నారు. భారత్‌లో కూడా ఈ అంశంపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చిందని పూనావాలా పేర్కొన్నారు. దేశంలో బూస్టర్‌ డోసుపై కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ప్రయాణాలు చేసే ప్రతిఒక్కరికీ బూస్టర్‌ డోసు అవసరమని.. దీనిపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తోందన్నారు. బూస్టర్‌ డోసుపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని పూనావాలా తెలిపారు.

దేశంలో కరోనా కేసులు తగ్గుతూ ఉండటం ఊరటనిస్తోంది. కొత్తగా 913 కరోనా కేసులు,81 మరణాలు నమోదయ్యాయి. వెయ్యి కన్నా తక్కువగా రోజువారీ కేసుల సంఖ్య నమోదు కావడం గత 715 రోజుల్లో ఇదే తొలిసారి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. రోజువారీ పాజిటివీ రేటు 0.29 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 184.61 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: Corona alert, Covid -19 pandemic, Covid vaccine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు