ఒక్క మహిళ కోసం పోలింగ్ బూత్... ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే...

ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha Elections 2019 : రూల్స్ పాటించడంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏమాత్రం రాజీ పడట్లేదు. ఒక్క ఓటైనా సరే... దానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది.

  • Share this:
భారత్, చైనా సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఈసారి ఓ ప్రత్యేక సందర్భం ఉంది. ఒక్క మహిళ కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఎక్కడో కొండల్లో. దాని వివరాలు తెలిస్తే... ఓటుకు కేంద్ర ఎన్నికల సంఘం అంత విలువ ఇస్తోందా అనిపించకమానదు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలోగాం గ్రామం చైనా సరిహద్దు వెంట ఉంటుంది. అక్కడ సొకేలా టయాంగ్ అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆ ప్రాంతం అంజ్వా జిల్లా నుంచీ 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి వరకూ వెళ్లాలంటే రవాణా మార్గం లేదు. కొండలు, సెలయేళ్లు, లోయలూ దాటుకుని నడుచుకుంటూ వెళ్లాలి. అందుకోసం ఓ రోజంతా టైమ్ పడుతుంది. అయినప్పటికీ ఆమె కోసం ఆమె ఊరిలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు.

సొకేలా ఉండే ఊరు... హేయులింగ్ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుంది. అక్కడ చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లలో 39 ఏళ్ల సొకేలా మాత్రమే అక్కడి ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేయించుకుంది. మిగిలిన వాళ్లంతా వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. సొకేలా భర్త జెనేలాం తయాంగ్.... వేరే బూత్‌లో పేరు నమోదు చేయించుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆమె కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం వచ్చింది.


ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారులు, సెక్యూరిటీ అధికారులు వచ్చే వారం మాలోగాంకి వెళ్లబోతున్నారు. ఓటర్ ఒక్కరే ఉన్నప్పటికీ రూల్స్ ప్రకారం పోలింగ్ కేంద్రాన్ని ఉదయం 7 గంటల నుంచీ సాయంత్రం 5 గంటల వరకూ తెరిచివుంచాల్సి ఉంటుంది. సొకేలా ఓటు వేసేవరకూ తెరిచి ఉంచుతామని, ఆ తర్వాతే క్లోజ్ చేస్తామనీ అధికారులు తెలిపారు.

చూశారా ఓటు ఎంత విలువైందో. ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పక ఓటు వెయ్యాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలతోపాటూ... అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు లోక్ సభ స్థానాలకు కూడా తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

చంద్రబాబులో కొత్త ఉత్సాహం... మమతా బెనర్జీ ఫార్ములాని ఫాలో అవుతున్నారా...

ప్రతిపక్షాల విమర్శలే తమ నినాదాలు... బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ... అధికార పార్టీల కొత్త ఎత్తుగడ

నరేంద్ర మోదీ, చంద్రబాబు ట్వీట్ల వార్... ఎవరూ వెనక్కి తగ్గట్లేదుగా...

ఏపీలో పెరిగిన బెట్టింగుల జోరు... వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ...
First published: