Home /News /national /

SEPARATE CERTIFICATE FOR COVID 19 SHOULD BE ISSUED TO KIN OF DEAD PERSON ORDERED MADRAS HIGH COURT AK GH

Covid Death Certificate: డెత్ సర్టిఫికేట్‌తో పాటు కోవిడ్ పత్రం.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరణించిన ప్రతి వ్యక్తికి మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు.. వారి మరణానికి కారణం కోవిడ్-19 అని తెలిపే మరో అదనపు పత్రాన్ని కూడా జారీ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

కరోనా కారణంగా చనిపోయినవారి పేరుతో మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు మరో సర్టిఫికెట్ అందజేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ కారణంగానే సదరు వ్యక్తి కన్ను మూశాడని ఈ పత్రంలో పేర్కోవాలని తెలిపింది. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యుల్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికెట్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ ధ్రువీకరణ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పరిహారం పొందడానికి వినియోగించుకోవచ్చని తెలిపింది. కోవిడ్ మృతులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే డెత్ సర్టిఫికెట్‌లో కరోనా మహమ్మారే మరణానికి కారణమని పేర్కొవాలని శ్రీ రాజలక్ష్మీ అనే మహిళ మద్రాస్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పిటీషన్ పై గురువారం మాద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ పిటీషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. కోవిడ్ కారణంగా మరణించిన వ్యక్తులకు మరణ ధ్రువీకరణ పత్రాల్లో దీన్ని ప్రత్యేకంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తితో కూడిన ఫస్ట్ బెంచ్ ఈ కేసుపై విచారణ చేపట్టింది. మరణించిన ప్రతి వ్యక్తికి మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు.. వారి మరణానికి కారణం కోవిడ్-19 అని తెలిపే మరో అదనపు పత్రాన్ని కూడా జారీ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఫలితంగా భవిష్యత్తులో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పరిహారం అందుకునేందుకు వీలుంటుందని తెలిపింది. పిటీషనర్ లేవనెత్తిన సమస్యలపై సమగ్ర నివేదికను రాష్ట్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 10 వారాలకు వాయిదా వేసింది. కోవిడ్ మృతులకు పరిహారం అందజేయాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
First published:

Tags: Coronavirus, Madras high court

తదుపరి వార్తలు