హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Crime: మనుషులు కాదు మానవ మృగాలు..నరబలి కేసులో సంచలన నిజాలు తేటతెల్లం..శరీరాన్ని 56 ముక్కలు చేసి..ఆపై..

Crime: మనుషులు కాదు మానవ మృగాలు..నరబలి కేసులో సంచలన నిజాలు తేటతెల్లం..శరీరాన్ని 56 ముక్కలు చేసి..ఆపై..

మనుషులు కాదు మానవ మృగాలు..నరబలి కేసులో సంచలన నిజాలు తేటతెల్లం..శరీరాన్ని 56 ముక్కలు చేసి..ఆపై ఏం చేశారంటే?

మనుషులు కాదు మానవ మృగాలు..నరబలి కేసులో సంచలన నిజాలు తేటతెల్లం..శరీరాన్ని 56 ముక్కలు చేసి..ఆపై ఏం చేశారంటే?

మహిళల బలి అనంతరం వారిని కూర వండుకొని తిన్నారని తేలింది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి శరీరాన్ని ఏకంగా 56 ముక్కలుగా కోసినట్లు తెలుస్తుంది. అందులో కొన్ని శరీర భాగాలను భగవాల్ సింగ్, లైలా తిన్నట్లు ఒప్పుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

కేరళలో (kerala) ఇద్దరు మహిళల నరబలి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులైన  భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ ను పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ఈ నిందితులు డబ్బు కోసం ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వీరికి 14 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ కోర్టు (Court) నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కేసుకు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పెళ్లికి ముందే ఆమెతో ఎఫైర్.. పెళ్లయినా తీరుమారకపోవడంతో ఓ రాత్రి అనుకోని ఘటన

ఇద్దరి మహిళల బలి అనంతరం వారిని కూర వండుకొని తిన్నారని తేలింది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి శరీరాన్ని ఏకంగా 56 ముక్కలుగా (Pieces) కోసినట్లు తెలుస్తుంది. అందులో కొన్ని శరీర భాగాలను భగవాల్ సింగ్, లైలా తిన్నట్లు ఒప్పుకున్నారు. అలాగే మిగతా శరీర భాగాలను రెండు వేర్వేరు చోట్ల పాతిపెట్టినట్లు తెలుస్తుంది. డబ్బు కోసం తాంత్రికుడు చెప్పినట్టే ఇదంతా చేశామని దంపతులు అంగీకరించారు.

ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి షమీ అని పోలీసులు వెల్లడించారు. అతను చెప్పినట్లే ఆ దంపతులు మహిళలను బలి ఇచ్చి వారి రక్తాన్ని గోడలకు అంటించారు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా (Pieces) చేసి కూరొండుకొని తిన్నారన్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న షఫీ Shafi) మామూలు మనిషి కాదని సైకో అని తెలుస్తుంది. ఇప్పటికే అతనిపై అనేక కేసులున్నాయి. అనేకమంది వృద్దులపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు.

ఈ ఇద్దరు మహిళలు జీవనోపాధి కోసం లాటరీ టికెట్లు అమ్ముకునే వారని పోలీసులు తెలిపారు. అందులో ఒక మహిళ అయిన రోసిలి జూన్ లో కనిపించకుండా పోయింది. దీనితో ఆమె కూతురు ఆగష్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మిగిలిన మరో మహిళ పద్మం మిస్సింగ్ కాగా ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కడవంతర పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఓ ఏజెంట్ మహిళలను తీసుకురావడంలో సహాయం చేశారు. ఫేస్ బుక్ (Face book Fake account) నకిలీ ఖాతా ద్వారా భగవత్ ను కలిసేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పెరుంబరుకు చెందిన వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో మంచి జరుగుతుందని నమ్మించి తీసుకెళ్లారు. తమ పథకంలో భాగంగా దంపతులు అష్టైశ్వర్యాలతో తులతూగాలని దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పలు రకాల్లో విచారణ చేయగా నరబలి విషయం బయటకు వచ్చింది. నేడు నిందుతుల నుండి మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఏదేమైనా అక్షరాస్యత ఎక్కువ గల కేరళలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

First published:

Tags: Crime news, Kerala

ఉత్తమ కథలు