తమిళనాడు దివంగత సీఎం జయలలిత (Jayalalitha) మరణంపై సంచలన విషయం వెల్లడైంది. జయలలిత మృతిపై విచారణ కమిటీ ఆర్ముగస్వామి కమీషన్ ప్రభుత్వానికి సంచలన రిపోర్ట్ ఇచ్చింది. 2016 డిసెంబర్ 5న రాత్రి 10 గంటలకు తర్వాత జయలిత (Jayalalitha) చనిపోయారని అప్పట్లో అపోలో ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. అయితే ఆమె మరణంపై దర్యాప్తు చేసిన కమీషన్ మాత్రం డిసెంబర్ 4న మధ్యాహ్నం 3.50 నిమిషాలకే మరణించారని రిపోర్ట్ లో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Pawan Kalyan: రాళ్లా.. రాడ్ల.. నేటి నుంచి యుద్ధానికి రెడీ.. చెప్పుతో కొడతా అంటూ పవన్ వార్నింగ్
జయలలిత (Jayalalitha) మృతిపై విచారణ చేపట్టాలని కమీషన్ తన రిపోర్టులో పేర్కొంది. శశికళ, శివకుమార్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ లను విచారించాలని కమీషన్ రిపోర్టు ఇచ్చింది.
జయలలిత 2016 డిసెంబర్ 5న రాత్రి చనిపోయిందని ఆస్పత్రి ప్రకటించింది. కానీ ఆధారాలను పరిశీలిస్తే 4వ తేదీన 3 గంటల నుంచి 3.50 మధ్య చనిపోయినట్లుగా ఉందని కమీషన్ అభిప్రాయపడింది. జయలలితకు సరైన వైద్యం అందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కి ఉండేవని ఆర్ముగస్వామి కమీషన్ అభిప్రాయపడింది. ఆమెకు యాంజియోగ్రఫీ చేయాలనీ డాక్టర్ సుమిన్ శర్మ సూచించిన తర్వాత కూడా ఆమెకు యాంజియోగ్రఫీ చేయలేదని కమీషన్ రిపోర్టులో పేర్కొంది. వైద్యం కోసం ఆమెను విదేశాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమని డాక్టర్ రిచర్డ్ పీలే చెప్పిన తర్వాత కూడా విదేశాలకు తీసుకెళ్లలేదని నివేదికలో పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ లో జయలలిత స్పృహతప్పి పడిపోయిన దగ్గరి నుండి అంతా గోప్యంగానే ఉందని నివేదికలో పేర్కొంది. ఇక కమీషన్ ఇచ్చిన రిపోర్టుతో ఇప్పుడు జయలలిత మృతిపై అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. అయితే ఆ 31 గంటలు ఏం జరిగింది? అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి దీనిపై స్టాలిన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamilandu