Mahesh Babu - Rajamouli: మహేష్ బాబు సినిమాలో బాలకృష్ణ పాత్రపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..
Mahesh Babu - Rajamouli: మహేష్ బాబు సినిమాలో బాలకృష్ణ పాత్రపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..
Mahesh Babu - Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి కూడా దాదాపు ఏడేళ్ళవుతుంది. బాహుబలి కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు. అయితే ఇద్దరూ వరస సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబుతో రాజమౌళి సినిమా వర్కవుట్ కావడం లేదు.
Mahesh Babu - Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి కూడా దాదాపు ఏడేళ్ళవుతుంది. బాహుబలి కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు. అయితే ఇద్దరూ వరస సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబుతో రాజమౌళి సినిమా వర్కవుట్ కావడం లేదు.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి కూడా దాదాపు ఏడేళ్ళవుతుంది. బాహుబలి కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు. అయితే ఇద్దరూ వరస సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబుతో రాజమౌళి సినిమా వర్కవుట్ కావడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం కచ్చితంగా మహేష్ సినిమాను పూర్తి చేస్తానంటున్నాడు రాజమౌళి. సాధారణంగా ఓ సినిమా విడుదలైన తర్వాత కానీ మరో సినిమాపై ఫోకస్ చేయని రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధం అవుతుండటంతోనే మహేష్ సినిమాపై కూడా దృష్టి పెట్టాడు.
చాలా సమయం దొరకడంతో కథ అనుకోవడంతో పాటు దానికి పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక.. కొన్ని రోజులు వెకేషన్ వెళ్లొచ్చిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ బాబు సినిమా పట్టాలెక్కుతుందని కన్ఫర్మ్ చేసాడు జక్కన్న. దాంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. దానికి ముందే త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు మహేష్. రాజమౌళితో సినిమా చేస్తే అది ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు కూడా వేచి చూస్తున్నారు.
సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి మామూలు సినిమాలు చేయడం మానేసాడు. ఈయన ఎంచుకుంటున్న జోనర్స్ కూడా పాన్ ఇండియన్ లెవల్‌లో ఉంటున్నాయి. కేవలం ఒక భాషను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం మానేసాడు రాజమౌళి. దాంతో సూపర్ స్టార్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా అని ఇప్పట్నుంచే అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
దీనికి సమాధానంగా జేమ్స్ బాండ్ తరహా కథ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో బిజినెస్‌మేన్ ఆడియో వేడుకకు వచ్చినపుడు మహేష్‌తో ఎలాంటి సినిమా చేయాలని అభిమానులను అడిగితే చాలా మంది జేమ్స్ బాండ్ కథ కావాలన్నారని చెప్పాడు రాజమౌళి. దీంతో అలాంటి కథనే ఇప్పుడు వండుతున్నారని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా కోసం కథ అనుకున్నామని చెప్పాడు రాజమౌళి.
అయితే బయట వస్తున్నట్లు జేమ్స్ బాండ్, ఆఫ్రికా కథలు.. ఇవన్నీ కావని.. అవన్నీ అబద్ధాలే అని కొట్టి పారేసాడు రాజమౌళి. మహేష్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద కథనే సిద్ధం చేసాడు విజయేంద్ర ప్రసాద్. మరోవైపు ఇందులో బాలకృష్ణ నటిస్తున్నాడని వస్తున్న వార్తల్ని కూడా ఖండించాడు దర్శక ధీరుడు. అలాంటిదేం లేదని.. కేవలం మహేష్ ఒక్కడే ఇందులో హీరో అని తెలిపాడు. బాలయ్య నటిస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పాడు ఈయన. ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేసాడు జక్కన్న.
మహేష్ బాబుతో చేయబోయే సినిమా బాహుబలి, ట్రిపుల్ ఆర్ కంటే పెద్దదని.. ఈ కథ కూడా అంతే పెద్దగా ఉంటుందని చెప్పాడు రాజమౌళి. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే రాజమౌళి కంటే ముందుగానే త్రివిక్రమ్, పరశురామ్ సర్కారు వారి పాట సినిమాలను పూర్తి చేయనున్నాడు మహేష్ బాబు. ఈ రెండు సినిమాలు 2022, 2023ల్లో విడుదల కానున్నాయి.
ఆ తర్వాత రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయనున్నాడు సూపర్ స్టార్. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఆఫ్రికన్ అడవుల్లోనే జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే దీనికోసం రాజమౌళి యూనిట్ కూడా లొకేషన్ వేట మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఏదేమైనా కూడా రాజమౌళి, మహేష్ సినిమా కోసం వేయి కళ్లతో చూస్తున్నారు అభిమానులు. అదెప్పటికి తీరనుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.